దేశంలో కరోనా విజృంభన కొనసాగుతున్న ఈ తరుణంలో ప్రస్తుతం చాలావరకు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకి వర్క్ ప్రం హోమ్ ఇచ్చేశాయి. అయితే , ఈ మహమ్మారి పీడ ఇప్పుడే విడిపోయేలా కనిపించకపోవడం తో సేవలను మరింత విస్తృతపరచటానికి ఐటీ కంపెనీలు కొత్త మార్గాల వైపు అడుగులు వేస్తున్నాయి. ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం చేయిస్తూ ఉత్పాదకతను గణనీయంగా పెంచుకున్న పలు సంస్థలు ఈ దిశగా ఆలోచిస్తున్నాయి. ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పట్టణాల్లో పని చేసుకునేందుకు వీలుగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసి అక్కడ ఆఫీస్ అట్మాస్పియర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. రెండు, మూడు కంపెనీలు కలసి వీటిని ఏర్పాటు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నాయి.
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ కూడా ఈ అంశాన్ని ధ్రువీకరిస్తోంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో దాదాపు 6లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో బీపీఓ, టెక్నికల్, సర్వర్ సంబంధ విభాగాల్లో పనిచేసే వారు తప్ప మిగిలిన 80శాతం మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీనివల్ల ఉత్పాదకత గతం కంటే పెరిగిందని నాస్కామ్ వెల్లడించింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న దశలో ఉద్యోగుల సొంత ప్రాంతాలకు దగ్గరగా వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు ఐటీ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయట. వేర్వేరు సంస్థల ఉద్యోగులు ఒకేచోట పనిచేయడం వల్ల సంస్థకు నష్టదాయకంగా ఉండే చర్యలను ఎలా నివారించవచ్చనే దానిపైనా మదింపు చేస్తున్నాయి. ముఖ్యమైన డేటా ఇతర కంపెనీల ఉద్యోగులు తెలుసుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి.
దీనితో భిన్నమైన సర్వీసులను అందించే వేర్వేరు కంపెనీలు కలిసి వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తున్నాయి. కరోనా సంక్షోభం సర్వీసు సెక్టార్‌పై లేకపోవడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఐటీ కంపెనీలు కొత్త జోష్ తో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా సూక్ష్మ, చిన్న ఐటీ కంపెనీల కోసం వర్క్ స్టేషన్ల తరహాలోనే ప్లగ్ అండ్ ప్లే విధానాన్ని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అమల్లోకి తీసుకువచ్చింది. కొన్ని ఐటీ కంపెనీలు వర్క్‌స్టేషన్ల ఆలోచనలు చేస్తున్నా అవి ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. కొవిడ్ పరిస్థితులు మెరుగుపడితే అవి కార్యరూపం దాల్చే అవకాశం ఉందని నాస్కామ్, సీనియర్ డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్ అన్నారు.