తమ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం బీజేపీ ఎమ్మెల్యేలకు నిత్య కృత్యమైంది. నిరుద్యోగులు పాన్ డబ్బాలు పెట్టుకోవాలని త్రిపుర సీఎం బిప్లవ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జర్నలిస్టులను నారదుడితో పోలుస్తూ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని, లేటు పెళ్లిళ్ల వలనే లవ్ జిహాద్ వంటి వ్యవహారాలు జరుగుతున్నాయని మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ పర్మర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా, రాజస్థాన్ లోని అల్వార్ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని మొట్టమొదటి ఆదివాసి ఆంజనేయస్వామి అని అహూజా షాకింగ్ కామెంట్స్ చేశారు. హనుమంతుడి అనుచరులైన వానర సైన్యానికి శ్రీరాముడు శిక్షణనిచ్చాడని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అహూజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతోపాలు అహూజా అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలలో మొట్టమొదటి దేవుడు హనుమంతుడేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన భారత్ బంద్ లో హనుమంతుడి ఫొటోను అగౌరవపరిచారని, అది తనను ఎంతో బాధించిందని అన్నారు. అలా జరగడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. అహూజా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది మొదటి సారి కాదు. 2016 ఫిబ్రవరిలో.... జేఎన్ యూ క్యాంపస్ లో ప్రతిరోజూ 3000 కండోమ్ లు, 2000 లిక్కర్ బాటిళ్లు దొరుకుతున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. 2017 డిసెంబర్ లో....గోవధకు పాల్పడిన వారికి, స్మగ్లింగ్ కు పాల్పడేవారికి ఒకే రకమైన శిక్ష విధించి చంపేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.