ప్రస్తుతం గబ్బిలం అనే పేరు వింటేనే అందరూ హడలిపోతున్నారు. దీనికి కారణం ..ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ..చైనాలో గబ్బిలాల వల్లే మనుషులకు సంక్రమించిందని ప్రచారంలో ఉంది. ఈ తరుణంలో ఓ గ్రామ శివారులో గుట్టలుగా గబ్బిలాలు చనిపోయిన ఉండటంతో అక్కడి స్థానికులంతా కరోనా భయంతో హడలెత్తిపోతున్నారు. అటు వైపు వెళ్లేందుకు కూడా జనం భయపడిపోతున్నారు.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. ఉత్తర ప్రదేశ్‌లో ని మీరట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మీరట్ లోని ఓ చెరువు సమీపంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు చనిపోయి కనిపించాయి. దీంతో ఆ గ్రామప్రజలు అటువైపు వెళ్ళడానికి కూడా భయంతో వణికిపోతున్నారు. దీనితో ఈ విషయం గురించి అధికారులకు సమాచారం చేరటంతో అటవీ శాఖ అధికారులు, పశువైద్యాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన గబ్బిలాలను పోస్టుమార్టం కోసం తరలించారు.
ఇదిలా ఉంటే మీరట్‌లోని గంగానగర్ లోని శివ్లోక్ కాలనీలో కొందరు కరోనాకు భయపడి గబ్బిలాలను నాటు తుపాకులతో కాల్చి చంపేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వరుసగా రెండు, మూడు రోజులుగా గబ్బిలాలు చనిపోతున్నాయని, గ్రామస్తులు వాపోతున్నారు. తమ గ్రామానికి ఏం జరగబోతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. దీనితో ఎవరైనా వాటిని కావాలనే చంపేస్తున్నారా..? లేదంటే పొలాల్లో చల్లే పురుగు మందు కారణంగా గబ్బిలాలు చనిపోయాయా…? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.