రాజ‌స్థాన్‌లోనూ `లవ్ జీహాద్‌` మొద‌లైందే!

Update: 2017-11-05 04:39 GMT
చిన్న‌ప్ప‌టి నుంచి ఒక మతంలోని ఆచారాలు, క‌ట్టుబాట్లు పాటిస్తారు! అప్ప‌టి వ‌ర‌కూ ఆడుతూ పాడుతూ క‌ళ్ల ముందే ఉన్న వీరంతా ఒక‌రోజు అక‌స్మాత్తుగా మాయ‌మైపోతారు! కొన్ని రోజుల వ‌ర‌కూ అస్స‌లు క‌నిపించ‌రు. ఏమైపోతారో తెలి య‌దు.. ఎక్క‌డికి వెళ్లారో తెలియ‌దు! స‌డ‌న్‌గా ముస్లిం యువ‌కుడితో తిరిగి వ‌స్తారు! బుర్ఖా ధ‌రించి ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు! ఇద్ద‌రం ప్రేమించుకున్నాం అని చెబుతారు. వెళ్లిపోతారు! ఇలాంటి సంఘ‌ట‌న‌లు కేర‌ళ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపుతున్నాయి! కొంద‌రు ముస్లింలు అమాయ‌క‌పు ఆడ‌పిల్ల‌ల‌ను ప్ర‌భావితం చేసి బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడుల‌కు పాల్ప‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లు అధిక‌మవుతున్నాయి. ఇలాంటి సంఘ‌ట‌నే ఇప్పుడు రాజ‌స్థాన్‌లోనూ జ‌రిగింది.

కేరళ `లవ్ జిహాద్‌` కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విష‌యం తెలిసిందే! ఇలాంటి సంఘ‌ట‌న‌లు లెక్క‌కు మంచి న‌మోదవుతున్నాయ‌ని ద‌ర్యాప్తు సంస్థ‌లు చెబుతున్నాయి! వీటికి అడ్డుక‌ట్ట వేయాల‌ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సూచిస్తున్నాయి. ఒక‌ప‌క్క ఇలా చెబుతుండ‌గానే.. రాజస్థాన్‌లో ఇప్పుడు మరో కేసు తెరపైకి వచ్చింది. పాయల్‌ సింఘ్వీ అనే 22 ఏళ్ల హిందూ యువతి రాజస్థాన్‌ హైకోర్టులో శనివారం బుర్ఖాతో ప్రత్యక్షమైంది. ముస్లిం యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్న.. ఆమె కోర్టు ప్రాంగణంలోనే తానొక ముస్లింనని ప్రకటించి సంచ‌ల‌నం సృష్టించింది.

గత నెల 25న ఇంటి నుంచి వెళ్లిన పాయల్‌ తిరిగి రాలేదని ఆమె సోదరుడు చిరాగ్ సింఘ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ ఫిర్యాదును పట్టించుకోకపోవటంతో నేరుగా కోర్టునే అతను ఆశ్రయించాడు. కాగా తాను ఏప్రిల్‌లో ఫయాజ్‌ మహ్మద్‌ను వివాహం చేసుకున్నట్లు యువతి రాతపూర్వకంగా కోర్టుకు తెలిపింది. కానీ, పాయల్ కుటుంబ సభ్యులు మాత్రం అపహరణ, బెదిరింపులతో ఆమెను లొంగదీసుకున్నారని.. వివాహ ధ్రువీకరణ నకిలీ పత్రాలు సృష్టించారని వాదిస్తున్నారు. చివరకు ఇరు పక్షాల వాదనలు విన్న రాజస్థాన్‌ హైకోర్టు యువతిని ప్రభుత్వ వసతి గృహానికి తరలించాలని పోలీసులను ఆదేశిస్తూ నవంబర్ 7కి తదుపరి విచారణ వాయిదా వేసింది. ఆమెను బెదిరించి బలవంతంగా మతం మార్పించి మరీ యువకుడు వివాహం చేసుకున్నాడని యువతి తల్లిదండ్రు లు  చెబుతున్నారు. తన ఇష్టప్రకారమే అంతా జరిగిందని యువతి చెబుతుండ‌టం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ప‌డేస్తోంది. ఇప్పుడు ఈ సంఘ‌ట‌న హాట్ టాపిక్గా మారింది.
Tags:    

Similar News