అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మహా నగర శివారులో ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న వైనం సంచలనంగా మారింది. అయితే.. వీరిద్దరి సూసైడ్ వెనుక చోటు చేసుకున్నపలు విషయాలు తాజాగా వెలుగు చూశాయి. తమ కుమార్తె ప్రేమ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆమె విషయంలో దారుణంగా వ్యవహరించిన వైనాన్ని గుర్తించారు. తల వెంట్రుకలు కట్ చేసి ఇంటికే పరిమితం చేశారు.
దీనికి తోడు ప్రేమికుడి నుంచి వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఒడిశాకు చెందిన పరమేశ్వర్ ఇరవై ఏళ్ల క్రితం మైలారుదేవర్ పల్లికి సమీపంలోని లక్ష్మీగూడలో నివాసం ఉంటున్నాడు. అతనికి నలుగురు సంతానం. పరమేశ్వర్ చిన్నకుమార్తె లీజా. ఇదే ప్రాంతంలో అక్రం అలియాస్ ఆప్సర్ నివసిస్తున్నారు. కాలేజీకి వెళ్లే సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం చోటు చేసుకొని ప్రేమించుకున్నారు.
వీరి ప్రేమ గురించి తెలిసిన లీజా కుటుంబ సభ్యులు పలుమార్లు అప్సర్ ను హెచ్చరించారు. అయినప్పటికి వీరిద్దరూ కలస్తున్న విషయాన్ని గుర్తించిన లీజా తల్లిదండ్రులు ఆమెను ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా ఉంచేశారు. ఆమె తల వెంట్రుకల్ని కత్తిరించి ఇంటికి పరిమితం చేశారు. దీంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. దీనికి తోడు అప్సర్ నుంచి ఫోన్ల మీద ఫోన్లు రావటంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. దీంతో అప్సర్ తో దాదాపు గంట పాటు మాట్లాడిన ఆమె.. గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకుంది.
అయితే.. ఆమె ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియక దాదాపు 135 సార్లు ఆమె ఫోన్ కు ఫోన్ చేశాడు. అయినప్పటికి ఎత్తకపోవటంతో సందేహం వచ్చి అతను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండొచ్చని భావిస్తున్నారు. అతడితో ఫోన్ మాట్లాడుతున్న సమయంలోనే లీజా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం అప్సర్ ను అదుపులోకి తీసుకున్న మైలారు దేవ్ పల్లి పోలీసులు అతన్ని రిమాండ్ కు తరలించారు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది.