లవర్స్ బాండ్ పేపర్.. అందులో ఏం కండీషన్లు ఉంటాయంటే?

Update: 2022-05-28 00:30 GMT
లవర్స్ బాండ్ పేపర్.. అందులో ఏం కండీషన్లు ఉంటాయంటే?
  • whatsapp icon
మన జీవితంలో పరిచయమయ్యే ప్రతీ వ్యక్తితోనూ మనకు ఒక బంధం ఏర్పడుతుంది. అది స్నేహం, ప్రేమ, వివాహం.. ఇలా ఏదైనా కావచ్చు. అయితే ఇలా ఏర్పడే బంధాల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తికి ఉండే ప్రాధాన్యాలను బట్టి వారితో ఉండే బంధం కూడా మారుతూ ఉంటుంది.

కొన్ని ప్రేమ జంటలను చూస్తే ప్రతి విషయంలో ఇద్దరి ఆలోచనలు, కార్యాచరణలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అలాంటి వారి కోసమే అమెజాన్ సంస్థ ఇప్పుడు ‘లవర్స్ ’బాండ్ ను తీసుకొచ్చింది.

ఇందులో భాగస్వామి మారాల్సిన విషయాలు రాసి అగ్రిమెంట్ చేసుకుంటే వాటిని మిగతా వారు పాటించి ఆ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం కలుగుతుంది. భిన్న స్వభావాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒక బంధంలో ఇమడగలుగుతున్నారంటే అదంతా ఆ ‘బాండింగ్’ మహిమనే..

ఎవరైనా ఆస్తులు కొనుగోలు సమయంలో బాండ్ పేపర్లు రాసుకుంటారు. ఆస్తులు బదిలీ చేసుకుంటున్నారు. కానీ ఇఫ్పుడు లవర్స్ మధ్య కూడా ఈ బాండ్ పేపర్లు వచ్చాయి. తమ ప్రేమలో ఏమేం ఉండాలి? ఎలా మసులుకోవాలన్నది బాండ్ పేపర్లో రాసుకొని ఒప్పందం చేసుకుంటున్నారు.

కలికాలంలో అన్ని వింతనే.. పాత ఒక రోత.. కొత్త ఒక వింత అన్నట్టు లవర్స్ మధ్య బాండ్ పేపర్ ఉంటుందని ఊహించారా? కానీ ఇది నిజంగా ఇప్పుడు జరిగింది. ప్రేమికుల మధ్యన బంధం బలంగా ఉండేందుకు ఈ బాండ్ పేపర్ ను వాడుతున్నారు.

ఆన్ లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ఇప్పుడు లవర్స్ కోసం ప్రత్యేకంగా బాండ్ పేపర్ ను అమ్ముతోంది. ఆ అగ్రిమెంట్ లో తన లవర్ ఎప్పుడూ రోమాంటిక్ గా ఉండాలని.. ఎలాంటి పరిస్థితుల్లోనూ కలిసి ఉండాలని మొత్తం 8 పాయింట్స్ తో అగ్రిమెంట్ ఉంది. ఇలాంటి అగ్రిమెంట్ ను మీరు కూడా చేసుకున్నారా? అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి.
Tags:    

Similar News