వారిద్దరినీ లక్నో లాక్కుందా.. ? ఫ్రాంచైజీల లబో దిబో

Update: 2021-11-29 11:31 GMT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15 వ ఎడిషన్ లో రెండు కొత్త ఫ్రాంచైజీలు రానున్న సంగతి తెలిసిందే. లఖ్ నవూ, అహ్మదాబాద్ ఫ్రాంచైజీల చేరికతో ఆ సారి జట్ల సంఖ్య 10కి చేరనుంది. దీనికితోడు జట్లు కేవలం నలుగురే ఆటగాళ్లను రిటైన్ చేసుకునే నేపథ్యంలో పోటీ కూడా పెరగనుంది.

సహజంగానే చాలా కీలక ఆటగాళ్లనే జట్లు అట్టి పెట్టుకుంటాయనే సంగతి తెలిసిందే. ముంబైలో రోహిత్ శర్మ, బుమ్రా, చెన్పైలో ధోని, హైదరాబాద్ కు విలియమ్సన్.. ఇలా కొందరి పేర్లు చెప్పొచ్చు. ప్రధానమైన వారిని ఉంచేసుకుని.. మిగతావారిని వేలంలో కొనుక్కుని జట్టు కూర్పును బలోపేతం చేసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, ఇక్కడే చిక్కొచ్చిపడింది. తాము ఎవరినైతే అట్టి పెట్టుకోవాలని అనుకుంటున్నామో వారినే ప్రత్యర్థులు లాగేసుకున్నారని ఆ జట్లు వాపోతున్నాయి. ఈ విషయం ఫిర్యాదులు చేసుకునేదాక వెళ్లింది.

అంత పనిచేశారా?

పంజాబ్ సూపర్ కింగ్స్ కెప్టెన్, ప్రధాన బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ టీమిండియా వైస్ కెప్టెన్ కూడా. రెండేళ్లుగా రాహుల్ స్థాయి పెరుగుతూ పోతోంది. అద్భతు ప్రతిభావంతుడైనప్పటికీ.. జట్టు మేనేజ్ మెంట్ తప్పిదాలతో రాహుల్ కెరీర్ గాడితప్పింది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. సూపర్ ఫామ్ లో ఉన్న అతడు రాకెట్ లా దూసుకెళ్తున్నాడు. ఐపీఎల్ లోనూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. చారం.

కాగా పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌, టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు ఐపీఎల్‌లో ఉన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావన అక్కర్లేదు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆరెంజ్‌ క్యాప్‌(అత్యధిక పరుగులు) అందుకున్న ఘనత అతడి సొంతం. అతడు బ్యాటర్‌గా రాణిస్తున్నా ... మిగతా జట్టు సరిగా లేకపోవడంతో ఓటములు ఎదురవుతున్నాయి. కానీ, రాహుల్‌ వంటి స్టార్‌ ప్లేయర్‌ను పంజాబ్ వదులుకోదు.

ఒక విధంగా చెప్పాలంటే ఆ జట్టుకు అతడే సూపర్ స్టార్. రాహుల్ లేకుంటే పంజాబ్ మ్యాచ్ లు కూడా చూడరు ఎవరు. కాగా, ఇప్పుడు రాహుల్ ను లఖనవూ లాగేసుకుందనే ప్రచారం జరుగుతోంది. ఎంత పెద్ద మొత్తమైనా చెల్లించి రాహుల్‌ను దక్కించుకునేందుకు బేరసారాలు మొదలుపెట్టిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఒప్పందం కూడా జరిగిపోయిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. అదే జరిగితే పంజాబ్ ఐపీఎల్ లో మరింత వెనుకబడినట్టే.

రషీద్ లేని హైదరాబాద్ ఐదేళ్ల క్రితం వరకు ఐపీఎల్ లో సన్ రైజర్స్ బౌలింగ్ బలం సాదాసీదా. అలాంటి సమయంలో వచ్చాడు రషీద్ ఖాన్. ఈ అఫ్గానిస్థాన్ మిస్టరీ బౌలర్ ను ఎదుర్కొనడం ఇప్పటికీ పెద్దపెద్ద బ్యాట్స్ మన్ కూ సాధ్యం కావడం లేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాజా టి20 ప్రపంచ కప్ లో అఫ్గానిస్థాన్ చక్కటి ప్రదర్శన వెనుక రషీద్ పాత్ర ఎంతో ఉంది.

అడపాదడపా భారీ హిట్టింగ్ తో జట్టుకు పనికొచ్చే పరుగులు చేయగల సత్తా రషీద్ సొంతం. అయితే, ఇప్పుడు రషీద్, రాహుల్ ను ప్రలోభాలకు గురిచేసి తమ జట్లను వీడేలా ఒప్పందాలు జరుగుతున్నాయంటూ పంజాబ్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

వీరిద్దరినీ సొంతం చేసుకునేందుకు లఖ్ నవూ ఆసక్తి చూపిస్తోందట. ఈ నేపథ్యంలో పంజాబ్‌, హైదరాబాద్‌ యాజమాన్యాలు ఆ ఫ్రాంఛైజీ వ్యవహార శైలిపై మౌఖికంగా ఫిర్యాదు చేసినట్లు వినికిడి. అయితే, ఇప్పటివరకైతే లేఖా పూర్వకంగా మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. లఖ్ నవూ టీమ్‌ కొంతమంది ఆటగాళ్లను ప్రలోభాలకు గురిచేస్తోందని రెండు ఫ్రాంఛైజీలు మౌఖికంగా ఫిర్యాదు చేశాయి. ‘‘ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఆరోగ్యకరమైన పోటీ ఉంటే ఫర్వాలేదు.

కానీ.. ప్రలోభాలకు గురిచేస్తే మాత్రం సహించం. జట్టును సమతుల్యం చేసుకునేందుకు ఇప్పటికే లీగ్‌లో పాల్గొంటున్న జట్లు ప్రయత్నిస్తుంటే.. ఇలా చేయడం మంచి పద్ధతి కాదు’’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. కాగా రాజీవ్‌ ప్రతాప్‌ సంజీవ్‌ గోయెంకా (ఆర్‌పీఎస్‌జీ) వెంచర్స్‌ లిమిటెడ్‌ రూ.7,090 కోట్లు (సుమారు బిలియన్‌ డాలర్లు) వెచ్చించి లక్నో జట్టును సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ని గౌతమ్ అదానీ గ్రూప్ దక్కించుకుంది.


Tags:    

Similar News