ప్రపంచానికి మరో పెద్ద తలనొప్పిగా మారారు రష్యా అధినేత వాద్లిమర్ పుతిన్. సంక్షోభ సమయంలో రష్యాను గట్టెక్కించటానికి అధికారంలోకి వచ్చిన అధినేతగా పరిచయమైన ఆయన.. తక్కువ కాలంలో తన రాజకీయ ప్రత్యర్థుల్ని బలహీనపర్చటమే కాదు.. రాజ్యాంగాన్ని మార్చేసి.. తనను తాను జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకోవటం తెలిసిందే.
ఈ మధ్యనే ఉక్రెయిన్ మీద దాడికి తెగబడి.. ప్రపంచానికి మరో తలనొప్పి తెచ్చి పెట్టిన ఆయన కారణంగా.. ఇవాల్టి రోజున మాంద్యం భయాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
ఉక్రెయిన్ దాడి పుణ్యమా అని.. పెట్రోల్.. డీజిల్ ధరలు పెరగటంతో పాటు.. పలు ఇబ్బందికర పరిణామాలకు కారణమవుతుందని చెప్పాలి. తాజాగా ఆయన డెబ్బై లోకి అడుగు పెట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ఒకప్పటి సోవియెట్ యూనియన్.. ఆ తర్వాతి కాలంలో వేర్వేరు దేశాలుగా ఆవిర్భవించిన మిత్ర దేశాల అధినేతలు పుతిన్ ను కలిశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇందులో భాగంగా బెలారన్ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో పుట్టిన రోజున పుతిన్ ను సెయింట్ పీటర్స్ బర్గ్ లో స్వయంగా కలిసి.. బర్త్ డే విషెస్ చెప్పారు. అంతేకాదు.. ఆయన పుట్టిన రోజు గిప్టుగా ఒక ట్రాక్టర్ ను ఇచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది. బెలారస్ అన్నంతనే ట్రాక్టర్ల పరిశ్రమ ఇట్టే గుర్తుకు వస్తుంది.
తాను బహుమతిగా ఇస్తున్న ట్రాక్టర్ కు సంబంధించిన సర్టిఫికేట్ ను పుతిన్ కు అందజేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. పుతిన్ వారికి అందజేసిన గిఫ్టు గురించి చెబుతూ.. తన తోటలో ఉపయోగించే ట్రాక్టర్ ను పుతిన్ కు కానుకగా ఇచ్చినట్లుగా చెప్పారు.
ఇక్కడ ట్విస్టు ఏమంటే.. పుతిన్ కు ఇచ్చిన బర్త్ డే గిప్టు గురించి బెలారస్ అధ్యక్షుడు గొప్పగా చెబితే.. పుతిన్ మాత్రం మాట వరసకు సైతం బహుమతి గురించి ప్రస్తావించకపోవటం ఆసక్తికరంగా మారింది. పుట్టిన రోజు వేళ.. ట్రాక్టర్ గిఫ్టుగా ఇవ్వటం పుతిన్ కు పెద్దగా నచ్చినట్లు లేదేమో? అందుకే.. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ఉండి ఉంటారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.