ఈ ప్రపంచంలో కొన్ని వందల రకాల కార్లు ఉన్నాయి. అయితే.. కొనుగోలు దారులు మాత్రం మూడే రకాలుగా ఉంటారు. కొందరు అవసరం కోసం కొనుగోలు చేస్తారు. మరికొందరు హోదా చూపించుకునేందుకు కొంటారు. ఇంకొందరు మాత్రం లగ్జరీ కోసం తెచ్చుకుంటారు. అందుకే.. కంపెనీలు కూడా ఈ మూడు రకాల కస్టమర్లను దృష్టిలో పెట్టుకొనే కార్లను తయారు చేస్తుంటాయి.
అయితే.. లగ్జరీ కార్ల విషయానికి వస్తే.. వీటిని తయారు చేసే కంపెనీలు కూడా చాలానే ఉన్నాయి. విలాసవంతమైన కార్లను తయారు చేస్తూ.. అత్యంత ఖరీదైన ధరకు విక్రయిస్తుంటాయి. అయితే.. ఎన్ని ఉన్నా రోల్స్ రాయిస్ కంపెనీ కార్లకు ఉండే క్రేజే వేరు.
ప్రపంచంలోనే అత్యద్భుతమైన కారుగా.. రాజసానికి, విలాసానికి కేరాఫ్ గా ఈ బ్రాండ్ కార్లను గుర్తిస్తుంటారు వాహనదారులు. కేవలం లగ్జరీ కార్లను మాత్రమే తయారు చేసే ఈ కంపెనీ నుంచి.. లేటెస్ట్ గా మరో రెండు న్యూ మోడల్స్ రిలీజ్ అయ్యాయి.
ఇందులో ఒకటి Wraith Landspeed (వ్రైత్ లాండ్ స్పీడ్), రెండోది Dawn Landspeed (డాన్ లాండ్ స్పీడ్). ప్రస్తుతానికి ఈ రెండు మోడళ్లు కలిపి కేవలం 55 కార్లను మాత్రమే తయారు చేసింది రోల్స్ రాయిస్. కారణం ఏమంటే.. దీని ధర అధికంగా ఉండడమే. ఈ కారు ధర సుమారు రూ.6 కోట్లు ఉంటుంది.
యాష్ అండ్ బ్లాక్ కలర్ మిక్స్డ్ గా వచ్చిన ఈ కార్లు నాణ్యతలోనూ, వేగంలోనూ సాటిలేనివి. అద్భుతమైన ఫినిషింగ్ తో చూడగానే ఆకట్టుకునే ఈ కార్లు.. ఇంటరీయర్ విషయంలోనూ అద్భుంగా ఉన్నాయి. సీట్ల నుంచి సౌండ్ సిస్టమ్ వరకు.. పికప్ నుంచి స్మూత్ నెస్ వరకూ అన్నింటా ఎదురులేని ఫీచర్లు ఈ కార్ల సొంతం. వీటి సేల్ తర్వాత ప్రొక్షన్ గురించి ఆలోచించనున్నట్టు కంపెనీ తెలిపింది.