శనివారం రాత్రి 11 గంటల సమయంలో మరణించిన ప్రముఖ సినీ నటులు మాడా వెంకటేశ్వరరావు అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మృతి చెందిన ఆయన భౌతిక కాయాన్ని బుధవారం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మాడాకు నలుగురు కుమార్తెలు.
వీరిలో ఒకరు అమెరికాలో ఉన్నారు. ఆమె కడసారి చూసేందుకు వీలుగా అంత్యక్రియలు బుధవారం చేయాలని నిర్ణయించారు. ఇక.. ఆయన భౌతికకాయాన్ని బుధవారం పిలింనగర్ రోడ్డు నెంబరు 1కి తీసుకురానున్నారు. అభిమానుల సందర్శనార్థం కోసం బుధవారం స్వగృహంలో కాసేపు ఉంచి అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని భావిస్తున్నారు.