మోసానికి కాదేదీ అనర్హం అనుకుందో ఏమో.. ఓ కిలాడీ లేడీ జనాల్ని భలేగా బుట్టలో వేసుకుంది! అంతేకాదు, కిలాడీ లేడీలకు గురువు అనిపించుకునే రేంజ్‌లో మోసానికి పాల్పడి.. అందరినీ మూడు చెరువుల నీళ్లు తాగించింది. తన అందానికి ముగ్ధులై పోయిన ఇద్దరు దేశాధి నేతలే తన కాళ్లదగ్గర పడున్నారని కథలు చెప్పింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కేంద్రంగా స్టోరీలు నడిపి జనాల్ని నిలువునా ముంచింది. ఇక, ఈ కిలాడీ లేడీ బాగోతం బట్టబయలు కావడంతో అమెరికా పరిశోధన అధికారులు.. తమ సర్వీస్ లో ఇంత లేడీ కిలాడీని చూడలేదని ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొందరైతే.. ఆమె మోసం చేసిన విధానం తెలుసుకుని ఆశ్చర్య పోతున్నారు. ఇంతకీ ఆమె ఎవరో? జనాల్ని ఎలా బుట్టలో వేసుకుందో చూద్దాం..
ఆమె పేరు గిసెల్లె యాజ్జి! అమెరికాలో పుట్టి పెరిగింది. అంత అగ్రరాజ్యంలో పుట్టినా బుద్ధి మాత్రం పాతాళంలోనే ఉంది. జనాల్ని మోసం చేయడం ద్వారా కోట్లు సంపాయించాలని ప్లాన్ వేసింది. అనుకున్నదే తడవుగా తనను తాను ఒక దేశాధ్యక్షుడికి రహస్య భార్యనని, మరో దేశాధినేతకు మాజీ సతీమణినని పరిచయం చేసేసుకుంది. అంతటితో ఆగకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కు టాప్ సీక్రెట్ సలహాదారు తానేనని గొప్పలు పోయింది. ఇంకేముంది.. అందరూ ఆమె చుట్టూ చేరిపోయారు. ఆమె చెప్పిన ఈ మాటలు నిజమేనని నమ్మేశారు. ఈ క్రమంలోనే ఆ అమ్మడు.. తనను నమ్మిన వారితో వెనెజులా ఆర్మీకి టీ-షర్ట్ లు అమ్మే ప్రాజెక్టులో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేలా చేసింది. అయితే, ఎంతకీ ఈ పెట్టుబడులు వెనక్కి రాకపోవడంతో అనుమానం వచ్చిన మదుపరులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసుల అమ్మడి బాగోతం వెలికి తీసి ముక్కున వేలేసుకున్నారు.
ఈ సుందరాంగి వాషింగ్టన్ లోని ఓ భారీ అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది. పెద్ద మాటకారి అయిన ఈ అమ్మడు.. తన తోటివారిని బురిడీ కొట్టించడంలో పీహెచ్ డీ చేసింది. ఇవాంకా ట్రంప్ కు తానే తల్లి-గురువులాంటి దానినని జనాల్ని నమ్మించింది. అతి పెద్ద వైట్ హౌస్ లో ఇవాంకా కార్యాలయం పక్కనే నా ప్రత్యేక కార్యాలయం ఉందని గొప్పలు పోయింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిసి తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని, అంతకుముందు వెనెజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావేజ్ కి తాను మాజీ భార్యనని చెప్పుకొంది. అంతేకాదు - ట్రంప్-అల్ సిసి మధ్య తొలి ఫోన్‌కాల్‌ను తానే కలిపినట్టు చెప్పడం మరింత విడ్డూరం. తనకు ఓ ప్రైవేటు జెట్ ఉందని - వాషింగ్టన్ డీసీ శివారులోని సంపన్నప్రాంతమైన ఫాక్స్ హాల్ లో - స్పెయిన్ లో - మ్యాన్ హట్టన్ లో తనకు పలు నివాసాలు ఉన్నాయని భలేబాగా నమ్మించింది. ఇక, పెట్టుబడి దారులు నమ్మేసేలా.. తనకు నెలకు 2.1 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని కథలు అల్లింది.
ఈ కిలాడి లేడి.. కొలంబియాను కుదిపేసిన ఓ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అని అధికారులు గుర్తించారు. గిసెల్లె జల్లార్ అనే మహిళ కొలంబియాలో వందలమందిని మోసగించి.. 1995 జున్ లో జైలుపాలైంది. గర్భవతి కావడంతో ఏడు నెలల అనంతరం ఆమెను తిరిగి జైల్లో సరెండర్ అయ్యే షరతు మీద విడుదల చేశారు. కానీ, ఆమె తిరిగి రాలేదు. పరారీలో ఉన్న ఈ నేరస్తురాలు.. తీరా తాజాగా వాషింగ్టన్ లో తిష్టవేసి.. ఏకంగా దేశాధినేతల పేర్లతో సంపన్నులను మోసం చేసింది. మోసపోయిన వారు తలలు పట్టుకుంటుండగా.. అధికారులు ఆమె వైఖరితో ఇలాంటి లేడీలు కూడా ఉంటారా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.