మేడమ్ టుస్సాడ్స్ అనగానే.. సెలబ్రిటీలకు అచ్చుగుద్దినట్లుగా మైనపు బొమ్మలను తయారు చేసే మ్యూజియం గుర్తు రావడంలో ఆశ్చర్యం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల మైనపు బొమ్మలను అచ్చుగుద్దినట్లుగా తయారు చేస్తూ.. వారినే అబ్బురపరిచేలా రూపొందించేసి ప్రదర్శనకు ఉంచే ఈ మ్యూజియంకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులో స్థానం సంపాదించుకోవడం ప్రతీ సెలబ్రిటీకి ఇప్పుడొక కల అయిపోయింది.
అలాంటి టుస్సాడ్స్ ఇప్పుడు ఇండియా వచ్చేస్తోంది. వీటిని నిర్వహించే మెర్లిన్ ఎంటర్టెయిన్మెంట్స్.. న్యూఢిల్లీలో టుస్సాడ్స్ మ్యూజియంను ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తు చేసుకుంటోంది. ఎప్పుడో కాదు.. ఈ ఏడాది జూన్ లోనే ఢిల్లీ మ్యూజిం ప్రారంభం కానుందంట. రాబోయే 10 ఏళ్ల కాలంలో 5కోట్ల పౌండ్లతో తమ బ్రాండ్ ను విస్తరించుకునే ప్రణాళికల్లో భాగంగా ఇండియాలోనూ ఓ మ్యూజియంను ఏర్పాటు చేయబోతున్నారు.
న్యూఢిల్లీలో ఏర్పాటయ్యే టుస్సాడ్స్ మ్యూజియంలో 60 శాతం స్థానికులు అంటే మన దేశానికి చెందిన ప్రముఖుల విగ్రహాలు.. మిగిలిన 40 శాతం విదేశాలకు చెందిన ప్రముఖులకు స్థానం ఉంటుంది మెర్లిన్ ఎంటర్టెయిన్మెంట్స్ అనౌన్స్ చేసింది. మొదటగా 50 విగ్రహాలతో దేశంలో ఏర్పాటయ్యే మేడమ్ టుస్సాడ్స్ లో ఎవరెవరు కొలువు తీరునున్నారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.