పేకాట అనే మూడుక్షరాల మాట వినిపిస్తే చాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గయ్యిమంటారు. ఆయనకు ఏ మాత్రం నచ్చని మాటల్లో పేకాట ఒకటి. కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వేళ.. పేకాట మీద కన్నెర్ర చేయాలని పోలీసులను స్వయంగా ఆదేశాలు జారీ చేయటమే కాదు.. తాట తీసినా ఫర్లేదన్న సంకేతాలు ఇవ్వటం తెలిసిందే. ఆ మధ్యన తెలంగాణ భవన్ కు వెళ్లిన కొందరు.. సీఎం కేసీఆర్ ను కలిసి పేకాట విషయంలో తమకు కాసింత ఉపశమనం కలిగేలా నిర్ణయం తీసుకోవాలన్న వినతి ఇచ్చే ప్రయత్నం చేయటం.. ఆ సమయంలో కేసీఆర్ స్పందించిన తీరుతో అక్కడున్న వారంతా హడలిపోయారు.
పేకాట అంటే ఎందుకంత కోపం కేసీఆర్ కు అన్న విషయంపై క్లారిటీ లేకున్నా.. ఆయన వద్ద పేకాట పంచాయితీ కానీ.. పేకాటకు సంబంధించిన ముచ్చట్లు అస్సలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంత దాకా ఎందుకు.. పేకాట ఇష్యూలో తమ పార్టీకి చెందిన వారిపైనా కఠినంగా వ్యవహరించమని చెబుతారంటారు. అలాంటి కేసీఆర్.. తాజాగా వెలుగు చూసిన ఉదంతంలో ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు చర్చగా మారింది. సోమవారం రాత్రి మాదాపూర్ పరిధిలోని ఒక ఖరీదైన భవనంలో పేకాట ఆడుతున్న వైనంపై పోలీసులకు సమాచారం అందింది.
అంతే.. రంగంలోకి దిగిన ఎస్ వోటీ పోలీసులు.. రంగంలోకి దిగిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. తర్వాత పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ స్థాయికి చెందిన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధితో పాటు.. పలువురు రియల్టర్లు.. మహిళలు ఉన్నట్లుగా సమాచారం నిందితుల నుంచి రూ.1.5 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు పెద్ద బ్యాగుల నిండా డబ్బులు తీసుకున్న పోలీసులు వాటిని జఫ్తు చేసినట్లుగా సమాచారం.
సాధారణంగా పేకాట స్థావరాల మీద దాడి చేసిన వెంటనే.. ఆ వివరాల్ని పోలీసులు వెల్లడిస్తారు. అందుకు భిన్నంగా తాజా ఎపిసోడ్ లో మాత్రం వివరాలు వెల్లడించేందుకు అధికారులు ముందుకు రాకపోవటం గమనార్హం. ఇదిలా ఉంటే.. పోలీసులు సోదాలు చేసినప్పుడు అక్కడే ఉన్నట్లు చెబుతున్న అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ ని అదుపులోకి తీసుకున్నారా? లేదంటే వదిలేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అంతేకాదు.. పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్న మొత్తాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారం ఇవ్వటానికి ఆసక్తి చూపని పోలీసులు.. తర్వాత మాత్రం ఓపెన్ అయ్యారు.
ఈ పేకాట ఉదంతంపై వస్తున్న వార్తల్లో చాలా వరకు అసత్య ప్రచారం జరుగుతుందని చెబుతున్నారు. పట్టుబడింది ఎనిమిది మంది అని.. అందులో ఐదుగురు పురుషులు.. ముగ్గురు మహిళలు ఉన్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పేకాట భవనంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్లాట్ ఒక ప్రముఖ మంత్రికి సంబంధించిన కీలక అనుచరుడని.. ఆయన కూడా నేతగానే చెలామణీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
తన పార్టీలోని ఈ పేకాట గబ్బు ఎపిసోడ్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిస్తే.. ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకోవటం ఖాయమని.. అందరికి క్లాస్ పక్కా అంటున్నారు. ఇంతకీ.. ఈ పేకాట ఎపిసోడ్ లో తెలంగాణ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారా? లేదంటే.. ఇదంతా ఉత్త ప్రచారమా? అన్నది తేలాల్సి ఉంది.