తాజా ట్రెండ్; వారంలో ఒకరోజు నో స్నానం

Update: 2016-04-20 09:07 GMT
సోషల్ మీడియా హడావుడి పెరిగాక ఆన్ లైన్ ఛాలెంజ్ లు ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే ఎన్నో ఛాలెంజ్ తెర మీదకు రావటం తెలిసిందే. తాజాగా బాత్ ఛాలెంజ్ ఒకటి తాజా ట్రెండ్ గా మారింది. దేశంలో నీటి కటకట విపరీతంగా పెరిగిన క్రమంలో.. వారంలో ఒక్కరోజు స్నానం చేయకుండా ఉండటం ద్వారా భారీగా నీటిని ఆదా చేయాలన్నది తాజా నినాదం.

ఫూణెకు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ మాధవ్ ధన్వే నీటి పొదుపు మీద వినూత్నంగా ఆలోచించారు. అలా ఆలోచించిన ఆయనకు వచ్చిన ఐడియానే వారంలో ఒక రోజు స్నానం చేయకుండా మానటం. తనకొచ్చిన ఐడియాను అంఘోలిచి గోలీ గయా పేరుతో ఒక ఫేస్ బుక్ పేజీని రూపొందించి.. వారంలో ఒక్కరోజు స్నానం చేయకుండా ఉండటం ద్వారా భారీగా నీటిని ఆదా చేదామని సూచిస్తున్నారు.

ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఒక్క ఫుణె నగర ప్రజలు వారంలో ఒక్కరోజు స్నానం చేయకుండా ఉండిపోతే.. 6 కోట్ల లీటర్ల నీరు ఆదా అవుతుందని.. వారంలో ఒక్కరోజు స్నానం చేయనంత మాత్రాన కొంపలు మునగవని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ కు సోషల్ మీడియాలో ఆదరణ పెరుగుతోంది. మహారాష్ట్రలో తీవ్రంగా ఉన్న నీటి ఎద్దడి నేపథ్యంలో ఇతగాడి ఐడియా పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
Tags:    

Similar News