ఏపీకి వెళ్లి కేసీఆర్ రొయ్యలు తినింది అందుకేనా?

Update: 2015-12-15 04:43 GMT
తాను నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి పిలుపులు పిలిచేందుకు బెజవాడ వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై విపక్ష నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. బెజవాడకు వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆహ్వానం అందించటం వెనుక పెద్ద వ్యూహమే ఉందని చెబుతున్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొనే కేసీఆర్ ఇదంతా చేశారని ఆరోపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్.

తాజాగా ఢిల్లీలో మాట్లాడిన మధు యాష్కీ.. విజయవాడకు వెళ్లి కేసీఆర్ రొయ్యలు తిని రావటం వెనుక పెద్ద కారణమే ఉందని చెప్పుకొచ్చారు. త్వరలో హైదరాబాద్ లో జరిగే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సీమాంధ్రకు వెళ్లి రావటం ద్వారా సీమాంధ్రుల మనసుల్ని దోచుకునేందుకే బెజవాడ వెళ్లారంటూ విమర్శలు చేశారు. ఏపీకి వెళ్లి రొయ్యలు తిని రావటం వెనుక ఉన్న ప్లాన్ ఇదేనంటూ చెబుతున్న మధుయాష్కీ.. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు విషయంలో రెండు రోజులు హడావుడి చేయటం.. ఆ తర్వాత మర్చిపోవటం ఒక అలవాటుగా మారిందని మండిపడ్డారు. బెజవాడ వెళ్లి రొయ్యలు తిని వస్తే.. సీమాంధ్రులు కేసీఆర్ కు ఓటేసేస్తారా..?
Tags:    

Similar News