అమెరికా నుంచి తెలంగాణకు దిగుమతి అయిన నేతల్లో మధుయాష్కీ ఒకరు. తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులై.. అమెరికా నుంచి వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేసి.. దివంగత నేత వైఎస్ మీద తన అసమ్మతిని వ్యక్తం చేస్తూ.. ఢిల్లీలో రాహుల్ టీంతో క్లోజ్ గా ఉంటూ తనదైన శైలిలో రాజకీయాలు చేసే వారు మాజీ ఎంపీ మధు యాష్కీ.
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. మిగిలిన కాంగ్రెస్ నేతల మాదిరే స్తబ్దుగా ఉండిపోయారు. తెలంగాణ ప్రభుత్వం మీద పెద్దగా విమర్శలు చేయకుండా ఉండేవారు. యాష్కీని ప్రజలు మర్చిపోతున్న వేళ.. ఉన్నట్లుంది నిద్ర లేచిన వ్యక్తి మాదిరి విమర్శలు చేయటం మొదలు పెట్టారు. ఈ మధ్య వరకూ మాట్లాడని ఆయన.. ఇప్పుడు అందుకు భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తున్నారు.
తాజాగా తెలంగాణ అధికారపక్షంపై హోల్ సేల్ విమర్శలు.. ఆరోపణలు చేసేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమార్తె.. ఎంపీ కవిత.. మేనల్లుడు హరీశ్.. మంత్రి పోచారం.. ఇలా అందరిపై టోకుగా విరుచుకుపడ్డారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్ర స్థాయిలో మండిపడిన ఆయన.. ఒకటో రెండో అంశాలు కాకుండా.. పలు అంశాల్ని ప్రస్తావిస్తూ తెలంగాణ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యల్లో కొన్ని ముఖ్యమైన వాటిని చూస్తే..
= ఎంపీగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కవిత.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం చేయకుండా తన సంస్థ ద్వారా సాయం చేయాలని అనుకుంటే.. ప్రభుత్వం విఫలమైందని ఆమె ఒప్పుకున్నట్లా..?
= ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమైనందుకే తెలంగాణ జాగృతి సంస్థను ముందుకు తెచ్చి సాయం చేస్తున్నారా?
= రైతుల కుటుంబాల్లో మహిళల పసుపుతాళ్లు తెగుతుంటే.. కవిత మాత్రం బతుకమ్మ ఆడుతూ తిరుగుతోంది.
= తెలంగాణ అమరవీరుల శవాల మీద పేలాలు ఏరుకున్న కవిత ఇప్పుడు.. రైతుల ఆత్మహత్యల పేరుతో వసూళ్లు చేస్తున్నారు. బతుకమ్మ పేరుతో విదేశాల్లో వసూళ్లు చేస్తున్నారు.
= ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబమంతా వసూళ్లకు పాల్పడింది.
= కేసీఆర్ 110 ఎకరాల జాగీర్ ను ఏర్పాటు చేసుకున్నారు.
= కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు.. ఎర్రవెల్లి.. నర్సన్నపేట గ్రామాలకు సర్పంచ్ మాత్రమే.
= తన ఫాంహౌస్ లో మూడున్నర ఎకరాల్లో తవ్వుతున్న బావి కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లోని బావులు.. బోర్లు అడుగంటే అవకాశం ఉన్నందున.. ప్రజల నుంచి నిరసన వ్యక్తం కాకుండా ఉండేందుకు మాత్రమే ప్రేమ నటిస్తున్నారు.
= తన ఫాంహౌస్ లో అల్లం ఎండిపోతుందన్న బాధలో ఇసుమంతైనా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల విషయం లేదు.
= ఎంపీ కవిత లాక్మే షోరూంలు పెట్టుకున్నారు.
= మంత్రి హరీశ్ రావు.. ఆంధ్రా వ్యాపారులతో కలిసి టూవీలర్ వెహికిల్స్ బిజినెస్ చేస్తున్నారు.
= ఫద్మాలయ.. అన్నపూర్ణ స్టూడియోల మీద తొలుత కేసులు వేసి.. ఆ తర్వాత ఎలా లాలూచీకి పాల్పడ్డారో ప్రజలకు వివరించే ధైర్యం ఉందా?
= రైతుల ఆత్మహత్యల మీద ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులు హరీశ్ రావు.. పోచారం శ్రీనివాసరెడ్డిలు అబద్ధాలు చెబుతున్నారు.
= తన తండ్రిని కవిత.. శ్రీకృష్ణుడితో పోలుస్తున్నారని.. నిజానికి ఆయనో శిశుపాలుడు. పేదల రక్తం తాగే దుర్మార్గుడు.
= తెలంగాణ పోరాటంలో పాల్గొన్న జేఏసీలు అన్నీ ఏమైపోయాయి..?
= రైతులు పిట్టల్లా రాలుతుంటే జేఏసీలు ఏం చేస్తున్నాయి..?
= జేఏసీల పేరిట ఎన్నో ఆశలు కల్పించిన కోదండరాం ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారు..?
= ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు నేడు ఎందుకు మాట్లాడటం లేదు? జీతాలు పెంచితే రైతులు ఏమైపోయినా ఫర్లేదా..?