డీఎస్ చేరేది కాంగ్రెస్‌ లో కాదు బీజేపీలో

Update: 2018-07-25 14:26 GMT
ఓ వైపు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో రాజ‌కీయాలు హాట్ హాట్‌ గా మారుతున్నాయి. అధికార పార్టీ ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం అవుతున్న‌ట్లుగానే తాము సైతం సిద్ధం కావాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఆ పార్టీకి ఆదిలోనే ఎన్నో అవాంత‌రాలు త‌లెత్తుతున్నాయి. గ్రూపు రాజకీయాలు ఓవైపు - అధిష్టానంతో స‌మ‌న్వ‌య లోపం మ‌రోవైపు ఎదుర‌వ‌డంతో కాంగ్రెస్‌ లో కీల‌క ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. తాజాగా ఏఐసీసీ కార్య‌ద‌ర్శి మధుయాష్కీ చిట్ ఛాట్‌ లో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. త‌న రాజ‌కీయ గురువు - మాజీ పీసీసీ చీఫ్ అయిన డీఎస్‌ కు ఇటీవ‌లి కాలంలో టీఆర్ ఎస్ పార్టీలో ఎదుర‌వుతున్న ప‌రిణామాలపై విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీలోకి డీఎస్ వస్తున్నారనడం అవాస్తవమ‌ని అన్నారు. అంతేకాకుండా డీఎస్ అధికార బీజేపీలో చేరే చాన్స్ ఉంద‌ని చెప్పారు.

టీఆర్ ఎస్‌ లోని రాజ‌కీయాల వ‌ల్లే డీఎస్ లుక‌లుక‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయ‌ని మ‌ధుయాష్కీ తెలిపారు. మాజీ రాష్ట్రప‌తి ప్రణబ్ ముఖ‌ర్జి - కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీలను కలిసిందన్నది తప్పుడు ప్ర‌చార‌మ‌ని తెలిపారు. డీఎస్ బీజేపీలోకీ వెళుతున్నట్లు నాకు సమాచారం ఉందని మ‌ధుయాష్కి వివ‌రించారు.  నిజామాబాద్‌ లో కీల‌క‌మైన ప‌రిణామాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. డీఎస్ త‌న‌యుడు అరవింద్ - ఎంపీ కవిత ఇద్దరు పాలిటిక్స్ లో డూప్ గేమ్ అడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను నిజామాబాద్ ఎంపీగానే పోటీచేస్తాన‌ని తెలిపారు. డెబ్భై దాటినా వారిని పక్కన బెడతారనడం తప్పు అని, యువ‌త‌కు సీనియారిటికి ప్రాధాన్యం ఇస్తామ‌ని రాహుల్ అన్నార‌ని వివ‌రించారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ కు జాతీయ స్థాయిలో క్రెడిబిలిటీ జీరో అని మ‌ధుయాష్కీ ఎద్దేవా చేశారు. అవసరం మేరకే తప్ప  కేసీఆర్‌ను బీజేపీ నమ్మడం లేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ లో మార్పులు ఉంటాయనే విష‌యం త‌న‌కు తెలియదన్నారు. ఎవరితో పొత్తులు - సీఎం అభ్యర్థిని ప్రకటించడం ఆ రాష్ట్ర పరిస్థితుల కు అనుగుణంగా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ఆయ‌న తెలిపారు.
Tags:    

Similar News