చాలారోజుల తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ ఎంపీ మధుయాష్కీ కాస్తంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని తీసుకొచ్చిన మోడీ సర్కారు తీరుకు నిరసనగా భారత్ బంద్ కు పిలుపునివ్వటం.. పలు రాజకీయ పార్టీలు.. ప్రభుత్వాలు అండగా నిలవటం తెలిసిందే. దేశవ్యాప్తంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా బంద్ ముగిసింది. అయితే.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఒక ఉదంతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం తెలంగాణ అధికారపక్షానికి ఇబ్బందికరమైంది.
భారత్ బంద్ ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతుందని రైతు ఉద్యమ నేతలు ప్రకటించినప్పటికీ.. తెలంగాణలోని టీఆర్ఎస్ నేతలు ఉదయం ఎనిమిది గంటలకే రోడ్ల మీదకు వచ్చేశారు. షాపుల్ని మూయించటం.. రోడ్ల మీద బైఠాయించటం.. ధర్నా చేయటంలాంటివి చేశారు. సాధారణంగా తెలంగాణలో రాస్తారోకోలు.. ధర్నాలు లాంటి వాటిని పోలీసులు అస్సలు అనుమతించరు. ఒకవేళ.. చేసే ప్రయత్నంచేస్తే.. పెద్ద ఎత్తున పోలీసుల్ని మొహరించి.. సదరు నేతలు ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరమైతే హౌస్ అరెస్టు చేస్తారు.
అందుకు భిన్నంగా పోలీసుల తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అధికారపక్షమే నిరసనలు చేస్తున్న నేపథ్యంలో వారికి దన్నుగా నిలిచారు. రోడ్ల మీదకు వచ్చి ట్రాఫిక్ ను ఆపేసి ధర్నా చేసిన ఉదంతాల్లో కూకట్ పల్లిలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సామాన్యుల మీద చేయి చేసుకున్న వైనం సంచలనంగా మారింది. నేతలు చేసే ధర్నాలో తాము స్వచ్ఛందంగా పాల్గొనటం లేదని.. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ కొందరు తప్పు పట్టగా.. ఒక వ్యక్తిని వెనక్కి నెట్టటం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో టీవీ చానళ్లలో పెద్ద ఎత్తున ప్రసారమయ్యాయి. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి.
ఇదే అంశాన్ని ప్రస్తావించిన మధు యాష్కీ.. ఎమ్మెల్యే గాంధీ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. గాంధీ పేరు పెట్టుకున్న ఎమ్మెల్యే సామాన్య ప్రజల్ని కొట్టటం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ.. టీఆర్ఎస్ రెండు పార్టీలు దొందూ దొందేనని అన్న యాష్కీ.. రెండు పార్టీలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలేనని అన్నారు. దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల్లో ఓటమితో కొడుకును.. కుమార్తెను రోడ్ల మీదకు వచ్చిన నిరసన చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత రోడ్డు మీదకు వచ్చి నిరసన చేపడితే.. అందరు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల కాలంలో మధు యాష్కీ ఘాటు విమర్శలు చేయటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.