రాజకీయాల్లో వెలిగిపోవడానికి ఫిలిం సెలబ్రెటీలు ప్రయత్నించడం.. వాళ్ల గ్లామర్ ను పార్టీలు తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూడటం మామూలే. ఇరువురూ ఉభయతారకంగా పని చేసుకుంటూ వెళ్తుంటారు. ఒకప్పుడు సినీ గ్లామర్ ను పెద్దగా పట్టించుకోని భారతీయ జనతా పార్టీ కూడా గత కొన్నేళ్లుగా ఫిలిం సెలబ్రెటీలపై బాగా ఫోకస్ పెడుతూ వస్తోంది. 2014 ఎన్నికల్లో చాలామంది సినిమా వాళ్లను ఎన్నికల బరిలో నిలపడమే కాక.. ప్రచారానికి కూడా ఉపయోగించుకుని లాభపడింది. ఈసారి కూడా అదే స్ట్రాటజీని కొనసాగించాలని చూస్తోంది నరేంద్ర మోడీ-అమిత్ షా ద్వయం.
ఇందులో భాగంగానే బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ను పుణె నుంచి ఎంపీగా పోటీ చేయించాలని చూసింది. ఇప్పటికే షా ఆమెను కలిసి చర్చలు కూడా జరిపాడు. పుణె ఎంపీ టికెట్ ఆమెకు ఖరారైందని.. మాధురి కూడా సుముఖత వ్యక్తం చేసిందని ఇటీవల వార్తలొచ్చాయి. కానీ ఈ ప్రచారం నిజం కాదని తేల్చేసింది మాధురి. తాను భాజపా తరఫున పోటీ చేయడం లేదని ఆమె ఓ ప్రకటన విడుదల చేసింది. మాధురీ దీక్షిత్ అసలు రాజకీయాల్లోకే రావాలనుకోవడం లేదని.. ఆమె ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని మాధుని ప్రతినిధి ప్రకటనలో పేర్కొన్నారు. మరి మాధురీ తమ పార్టీ తరఫున బరలోకి దిగుతోందని.. పుణె లోక్ సభ స్థానానికి భాజపా అభ్యర్థి ఆమేనంటూ ప్రచారం చేసుకున్న భాజపా వర్గాలు ఇప్పుడేమంటాయో చూడాలి.