టీడీపీలో చేరిన నేతకు షాక్ - ఆఫీసులోకి రానీయలేదు!

Update: 2019-03-12 06:56 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నా.. సదరు నేతను పార్టీ ఆఫీసులోకి రానివ్వని ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం  పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.  గుంతకల్ మాజీ ఎమ్మెల్యేకు ఈ చేదు అనుభవం ఎదురైంది.

గుంతకల్ నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గిన మధుసూదన్ గుప్తా ఇటీవలే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. గుంతకల్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడం అనే హామీతో ఈయనను టీడీపీలోకి చేర్చుకున్నారు జేసీ సోదరులు. చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి.. టికెట్ విషయంలో అభయం ఇప్పించి పార్టీలోకి చేర్చుకున్నారట.

అయితే.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఈ విషయంలో అపంతృప్తిగా ఉన్నారు. టికెట్ తనకే దక్కాలని ఆయన పట్టుబడుతూ ఉన్నారు. కానీ జితేంద్రగౌడ్ కు టికెట్ ఇస్తే.. గెలవడం కష్టం అని, ఆయనకు బదులుగా.. గుప్తాకు టికెట్  ఇవ్వాలని బాబు కూడా భావిస్తున్నారట. అయితే తనకు టికెట్ దక్కకపోతే పార్టీకి రాజీనామా ఖాయమని..ఇండిపెండెంట్ గా బరిలోకి అని..జితేందర్ గౌడ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో ఎవరికి టికెట్ ఫైనలైజ్ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

ఈ పరిణామాల మధ్యన తను తెలుగుదేశం పార్టీ చేరినట్టే అని గుంతకల్ లోని ఆపార్టీ ఆఫీసులోకి వెళ్లబోయారట మధుసూదన్ గుప్తా. అయితే అక్కడే ఉన్న జితేంద్రగౌడ్ అనుచరులు గుప్తాను అడ్డుకోవడం జరిగింది. గుప్తాను పార్టీ ఆఫీసులోకి వెళ్లనిచ్చేది లేదని వాళ్లు అడ్డంగించారు. ఇటు గుప్తా అనుచరులు  కూడా ఎదురుదాడికి దిగారు. దీంతో పెద్ద గొడవ అయ్యింది.

ఆ పరిస్థితుల్లో.. పోలీసులు రంగంలోకి దిగి… ఇరు వర్గాలకూ సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం వెనక్కు తగ్గలేదు. దీంతో.. మధుసూదన్ గుప్తా..వెనక్కు వెళ్లిపోవాల్సి వచ్చింది. పార్టీ కార్యాలయంలోకి ఎంటర్ కాకుండానే ఆయన వెనుదిరిగారు. ఇలా ఉంది గుంతకల్ గొడవ. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఈ సీటు విషయంలో ఎవరి అభ్యర్థిత్వానికి ఓకే చెబుతారో!
Tags:    

Similar News