తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ఇష్టపడి ప్రారంభించిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముగిసిపోయినప్పటికీ ఆ రచ్చ ఇంకా కొనసాగుతోంది. ఏకంగా స్పీకర్ - అధికార పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకునే స్థాయికి ఆందోళన చేరిపోయింది.
పరకాలలో రూరల్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని లేని పక్షంలో పరకాల మండలాన్ని ఆచార్య జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలుపుతూ పరకాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న ఆందోళన సెగ తెలంగాణ శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి - పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి తాకింది. స్పీకర్ - ఎమ్మెల్యే వాహనాన్ని వెళ్లకుండా అఖిల పక్షం - రెవెన్యూ సాధన సమితి - మాదారం కాలనీకి చెందిన మహిళలు - స్థానికులు స్థానిక బస్టాండ్ వద్ద రాస్తారోకోతో అడ్డుకున్నారు. రోడ్డుపై అర్థనగ్నంగా పండుకొని నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది.
ఈ క్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాజీనామా చేయాలని - పరకాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ దరిమిలా వాహనాల నుండి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి - ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దిగి వారి వద్దకు వస్తుండగా రాస్తారోకో చేస్తున్న వారికి మద్దతుగా కుల సంఘాల నాయకులు - బీసీ సంక్షేమ సంఘం - స్థానికులు వారికి ఎదురుగా రావడం పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాతావరణం వేడెక్కింది. వారికి నచ్చచెప్పడానికి స్పీకర్ మధుసూదనాచారి ప్రయత్నించగా వారు ససేమిరా అంటూ నినాదాలు చేశారు. ఒక పక్క నినాదాలు - మరో పక్క మహిళలు నిలదీయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సహకారం అందిస్తామన్నారు. అనంతరం పోలీసులు వారిని తొలగించి వారికి దారి ఇవ్వడంతో వారు వాహనాలలో వెళ్లారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/