బ్రేకింగ్: సీఎంకు కరోనా పాజిటివ్

Update: 2020-07-25 10:50 GMT
దేశంలోనే ఓ బడా ప్రముఖ సెలెబ్రెటీకి కరోనా పాజిటివ్ గా తేలడం సంచలనమైంది. తాజాగా మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిసింది. వైరస్ బారిన పడిన మొదటి సీఎంగా చౌహాన్ నిలవడం గమనార్హం.

ఈ మేరకు మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ స్వయంగా కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో తనకు కరోనా సోకిందని క్లారిటీ ఇచ్చారు. తన ట్విట్టర్ హ్యాండిల్ మద్యప్రదేశ్ సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. ఆపై హోం క్వారంటైన్ కు ఒంటరిగా వెళ్ళారు. “నా ప్రియమైన ప్రజలరా నాకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేసుకున్నాను. నివేదికలో నాకు పాజిటివ్ గా వచ్చింది. నా సహోద్యోగులందరూ.. నేను ఎవరితో సంప్రదించినా వారంతా కరోనా పరీక్షను చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా దగ్గరి పరిచయస్థులు కూడా క్వారంటైన్ కు వెళ్లండి ”అని శివరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.

‘ఇక తాను అన్ని కరోనా మార్గదర్శకాలను అనుసరిస్తున్నాను. వైద్యుల సలహా ప్రకారం నన్ను నిర్బంధించుకున్నాను. నేను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రోజువారీ కరోనా సమీక్ష సమావేశంలో పాల్గొంటాను’ అని మధ్యప్రదేశ్ సీఎం క్లారిటీ ఇచ్చారు.

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 31వేలు దాటింది. ఈ నేపథ్యంలోనే సీఎంలకు కూడా కరోనా సోకడం కలకలం రేపుతోంది.

సీఎం ట్వీట్
Full View
Tags:    

Similar News