'లవ్ జిహాద్' అనేది.. హిందుత్వ సంస్థలు పెట్టిన పేరు. హిందూ మహిళలను ముస్లిం పురుషులు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఈ పదం సూచిస్తుంది. అయితే దీనికి వ్యతిరేకంగా లవ్ జిహాదీ వ్యతిరేక చట్టం తీసుకురాబోతున్నట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈ చట్టం ప్రకారం నాన్, బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారని, ఒకవేల ఈ కేసులో నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారని అన్నారు. అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మధ్యప్రదేశ్ మత స్వేచ్చ బిల్లు-2020 పేరుతో అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తులు ప్రారంభించినట్టు తెలిపారు. లవ్ జిహాదీకి వ్యతిరేకంగా చట్టం తీసుకురాబోతున్నట్లు కర్ణాటక,హర్యానా రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించగా , ఇప్పుడు ఆ జాబితాలో మధ్యప్రదేశ్ కూడా చేరబోతోంది.
వివాహానంతరం మతం మారమని బలవంతపెట్టేవాళ్లు,వేధింపులకు గురిచేసేవాళ్లు కూడా ఈ చట్టం కింద దోషులుగా పరిగణించబడుతారని అన్నారు. ఇకపోతే , లవ్ జిహాదీకి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలో లవ్ జిహాదీ ఉన్నట్లు ఇప్పటివరకూ ఏ కేంద్ర ఏజెన్సీలు నిర్దారించలేదని , ఇప్పుడున్న చట్టాల్లో ఎక్కడా లవ్ జిహాదీ పదమే లేదని , రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం వ్యక్తులు తమకు నచ్చిన మతాన్ని ఆచరించడానికి,అనుసరించడానికి స్వేచ్చ ఉందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో అలహాబాద్ హైకోర్టు కూడా లవ్ జిహాదీపై కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం వివాహం కోసం మతం మార్చుకోవడం ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. పలు రాష్ట్రాలు ఈ లవ్ జిహాదీ పై చర్యలకు సిద్దమౌతుండటంతో దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది.