ఎంఎస్ ధోని చుట్టూ పాలిటిక్స్

Update: 2020-08-18 02:30 GMT
మహేంద్రసింగ్ ధోని.. ఈ భారత క్రికెట్ దిగ్గజం రిటైర్ మెంట్ ప్రకటించాక.. అతడి గురించి పత్రికలు, ప్రముఖులు, మీడియా ఆకాశానికెత్తేస్తోంది. ఈ క్రమంలోనే ధోని రిటైర్ మెంట్ తరువాత పాలిటిక్స్ కూడా చుట్టుమట్టాయి. ధోని బీజేపీలో చేరి జార్ఖండ్ సీఎం అవుతారని.. ఎంపీగా పోటీచేసి దేశ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారం జరుగుతోంది.

ధోని రిటైర్ మెంట్ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన మధ్యప్రదేశ్ కు చెందిన భోపాల్ ఎమ్మెల్యే పీసీ శర్మ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని దేశ ఆణిముత్యమని.. క్రికెట్ లో భారత్ కు ఎంతో ఖ్యాతి తెచ్చాడని.. అతడికి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో సత్కరించాలి’ అని ట్వీట్ చేశారు.

అయితే ఇన్నాళ్లు కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ రంగాల్లో కృషి చేసిన వారికి మాత్రమే భారతరత్న ఇచ్చేవారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మానవజాతికి పాటుపడే ఏ రంగానికైనా అనే పదాన్ని చేర్చి సవరించింది.

క్రీడల్లో ఇప్పటిదాకా సచిన్ టెండూల్కర్ కు మాత్రమే భారతరత్న పురస్కారం ఇచ్చారు. మరి బీజేపీ నేతలు ఆశిస్తున్న ధోనికి భారతరత్న ఇస్తారా? ఇవ్వరా అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News