లంచం అడిగిన తహసీల్ధార్‌కు ఓ మహిళ ఊహించని షాక్ ఇచ్చింది. లంచంగా తన ఇంటిలో ఉన్న గేదెను ఎమ్మార్వో కార్యాలయానికి తీసుకువచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధీ జిల్లాలో సంచలనం రేపింది. తన పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తిని మ్యూటేషన్ చేసేందుకు అధికారులు లంచం కోరడంతో ఇలా చేసినట్టు తెలిపింది. పూర్తి వివరాలు చూస్తే...
నౌధియా గ్రామానికి చెందిన రాంకలీ పటేల్ అనే మహిళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని తన పేరు మీద మ్యుటేషన్ చేయాలని కోరుతూ తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ , ఆ పని ఎన్ని రోజులకి కాలేదు. దీనితో ఆఫీస్ కి వెళ్లి అడగ్గా ... ఆ పని కావాలంటే రూ. 10వేలు లంచం ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయ అధికారులు అడిగారు. దీనితో ఆ మహిళ అప్పు చేసి మరీ రూ.10వేలు తెచ్చి లంచంగా ఇచ్చింది. అయినా కూడా ఆ పని లేదు. దీనితో మరోసారి మరోసారి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి ఆరా తీసింది. ఇంకా పని కాలేదని, మ్యుటేషన్ చేయాలంటే మరో రూ.10వేలు లంచంగా ఇవ్వాలన్నారు.
దీనితో మరోసారి లంచం ఇవ్వడానికి ఆమె వద్ద డబ్బులు లేకపోవడంతో గేదెను తీసుకొని పని చేసి పెట్టాలని ఆయన కార్యాలయానికి తీసుకువచ్చి అక్కడే పిల్లర్‌కు కట్టేసింది. అయితే , లంచం అడిగిన విషయం అందరికీ తెలియడంతో తహసీల్దార్ అధికారులు ఆందోళన చెంది.. అసలు నిన్ను లంచం ఎవరు అడిగారు అంటూ ఆ మహిళపై కోపగించుకున్నారు. అంతేకాదు నాలుగు రోజుల కిత్రమే మహిళ పేరున మ్యుటేషన్ చేశామని, కావాలనే లంచం కేసులో ఇరికించాలని చూస్తోందని ఆరోపించారు. అలాగే మహిళపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని ఎమ్మారో కార్యాలయ అధికారులు తెలిపారు. కాగా గతంలోనూ ఓ రైతు ఇలాగే గేదెను ఇచ్చేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తరుచూ ప్రభుత్వ అధికారులు ఇలా లంచాలు డిమాండ్ చేస్తుండటంతో వారి తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.