ప్రిస్క్రిప్షన్ పై శ్రీహరి అని రాయాల్సిందే.. ఆ రాష్ట్ర సీఎం సంచలన వ్యాఖ్యలు!
దేశంలో బీజేపీ నేతలు వివిధ అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇవాళ ఏమీ కొత్త కాదు. గతం నుంచే ఎంతో మంది ఎన్నో రకాలుగా వివిధ అంశాలపై వివాదాస్పద కామెంట్లు చేస్తూ వచ్చారు. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారంతా చోటామోటా నేతలని అనుకుంటే పొరపాటు. వీరిలో చాలావరకు ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులే కావడం గమనార్హం.
తాజాగా ఇలాగే మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్పత్రుల్లో వైద్యులు ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు మందుల చీటీపై పై భాగంలో శ్రీహరి అని రాయాలన్నారు. ఆ తర్వాత మాత్రమే మందుల పేర్లు, వివరాలు రాయాలన్నారు.
హిందీలో వైద్య విద్య పూర్తిచేసిన డాక్టర్లు ఈ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పిల్లల్లో హిందీ పట్ల అభిమానాన్ని పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పడం గమనార్హం. ఇంగ్లిష్ మందుల పేర్లను హిందీలో రాస్తే వచ్చి ఇబ్బంది ఏమిటని కూడా ఆయన ప్రశ్నించారు.
ఇంతటితో ఆగని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ వైద్యులు రాసే మెడికల్ ప్రిస్క్రిప్షన్‌కు కొత్త భాష్యం చెప్పడం గమనార్హం. మెడికల్ ప్రిస్క్రిప్షన్‌ను వైద్యులు ఇంగ్లిష్‌కు బదులుగా హిందీలో ఎందుకు రాయకూడదని ఆయన ప్రశ్నించారు.
ఉదాహరణకు క్రోసిన్ మందును రాయాలనుకున్నప్పుడు హిందీలో క్రోసిన్ అని రాస్తే వైద్యులకు వచ్చే సమస్య ఏముంటుందన్నారు. ఇక నుంచైనా వైద్యులు హిందీలోనే మందుల చీటీ రాయడం అలవాటు చేసుకోవాలని ఆయన కోరారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్వహించిన హిందీ వ్యాఖ్యాన్ కార్యక్రమంలో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా మందుల చీటీపై భాగంలో శ్రీహరి అని రాయాలని వ్యాఖ్యానించారు.
తాను ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకం కాదని, అయితే జాతీయ భాష అయిన హిందీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని శివరాజ్‌సింగ్ చౌహాన్ చెబుతుండటం గమనార్హం,
కొన్ని దేశాలు తమ జాతీయ భాషల్లోనే అన్ని పనులు చేసుకుంటున్నాయని శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. ఆయా దేశాలు వారి భాషల్లోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయని గుర్తు చేశారు.
ఇంగ్లిష్ లేకుండా ఏ పని చేయలేమనే ఆలోచన నుంచి బయటకు రావాలని శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. రష్యా, జర్మనీ, జపాన్, చైనా దేశాల్లో ఇంగ్లిష్ ఎవరూ మాట్లాడరని గుర్తు చేశారు. వారి మాతృభాషల్లోనే అన్ని పనులను చక్కబెట్టుకుంటున్నారని తెలిపారు. దేశంలో కూడా ఇంగ్లిష్‌కు బదులుగా హిందీని ఎక్కువగా ఉపయోగించాలన్నారు.