రాజ్యాంగ పరమైన అంశాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యవహారంలో ఏ మాత్రం తేడా వచ్చినా న్యాయస్థానాల నుంచి మందలింపులతో పాటు జరిమానాలు సైతం ఎదుర్కోకతప్పదు. ఓ కేసు విషయంలో పిటిషనర్ కు ఈ విషయం అవగతమైంది. అంతేకాదు మరోసారి ఇలాంటి వ్యవహారంలో వేలుపెట్టకూడదని తెలిసొచ్చింది.
వివరాల్లోకి వెళితే.. కరెన్సీ నోట్లపై గాంధీ పేరు ముందు మహాత్మ పదాన్ని వాడటం నిషేధించాలని కోరుతూ కోల్ కతాలోని జాదవ్ పూర్ వర్సిటీ రీసెర్చి స్కాలర్ మురుగనాథమ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ కు విచారణార్హత లేదని మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి పిటిషన్లతో న్యాయవ్యవస్థ విలువైన సమయం వృధా అవుతుందని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎం.సుందర్ తో కూడిన హైకోర్టు బెంచ్ పిటిషనర్ ను తీవ్రంగా మందలించింది. అంతేకాదు విలువైన కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు మురుగనాథమ్ కు రూ.10,000 జరిమానా విధించింది.
భారత కరెన్సీ నోట్లపై గాంధీ పేరు ముందు మహాత్మా అని వాడటంపై రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ పిటిషన్ లో మురుగనాథమ్ సవాల్ చేశారు. ఆర్ బీఐ మహాత్మా అనే పదం వాడటం రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వానికి విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆయనను మందలించడమే కాకుండా రూ.10 వేలు జరిమానా సైతం విధించింది.