స్థాయి ఏదైనా అందరూ మనుషులే. అందరి భావోద్వేగాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయన్నట్లుగా ఉంది తాజా పరిణామాన్ని చూస్తే. కోట్లాది మంది ప్రజల మనసుల్ని దోచుకున్న ఒక మహా నాయకురాలు ఆసుపత్రిలో రెండున్నర నెలలకు పైనే ఉంటే ఒక్క ఫోటో కూడా బయటకు విడుదల చేయకుండా.. అసలేం జరుగుతందో తెలియకుండా చేసి.. ఆమె ఇక లేదన్న చేదునిజాన్ని అంగీకరించాల్సి వచ్చినప్పుడు ఎంతో వేదన కలుగుతుంది. ఇలాంటి వేళ.. కొందరు పుణ్యమా అని పుట్టే కొన్ని సందేహాలకు సకాలంలో.. సరైన విధంగా సమాధానాలు రాని పక్షంలో అవి అంతకంతకూ బలపడుతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే అమ్మ మృతిమీద నెలకొన్న పరిస్థితి.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సందేహాలు వ్యక్తం చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటీషన్లను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు అనుమానాల్ని వ్యక్తం చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. జయలలిత మరణంపై మీడియా అనుమానాలు వ్యక్తం చేసిందని.. తనకు కూడా వ్యక్తిగతంగా అనుమానాలు ఉన్నట్లుగా న్యాయమూర్తి జస్టిస్ వైద్యలింగం వ్యాఖ్యానించటం అన్నాడీఎంకే నేతలకు ఇప్పుడు షాకింగ్ గా మారింది.
జయ మృతదేహాన్ని మళ్లీ పరీక్షించాలని తాము ఎందుకు ఆదేశించకూడదంటూ న్యాయమూర్తి ప్రశ్నించటమే కాదు.. ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె బాగానే ఆహారం తీసుకునేవారన్న విషయాన్ని గుర్తు చేశారు. వైద్యం వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారన్న ప్రశ్నతో పాటు.. అలా ఎందుకు చేశారంటూ సూటిగానే ప్రశ్నించారు.
అరుంబాక్కంకు చెందిన జోసెఫ్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు..తన పిటిషన్ లో పలు అంశాల్ని ప్రస్తావించారు. తొలుత జ్వరం కారణంగా జయను ఆసుపత్రిలో చేర్పించారని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని వార్తలు వచ్చాయని.. అలా జరగలేదని.. జయ ఆరోగ్యం అంతకంతకూ క్షీణించిందంటూ అపోలో ఆసుపత్రి యాజమాన్యం బులిటెన్లు విడుదల చేశారన్నారు.
జయదేహాన్ని చూసిన వారు ఆమె రెండు కాళ్లను తొలిగించిన విషయాన్ని గమనించారని.. ఆమెదేహం ఎక్కువ రోజులు చెడకుండా ఉండేందుకు ఆసుపత్రి వర్గాలు కాళ్లను తొలగించి ఉంటారన్నఅభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. పలు సందేహాలు గుప్పించారు. ఇలాంటి సందేహాలపై విచారణ చేస్తున్న న్యాయమూర్తి సైతం తనకూ వ్యక్తిగతంగా జయ మృతి మీద అనుమానాలు ఉన్నాయని చెప్పటం ఇప్పుడు సంచలనంగా మారింది.