సెలెబ్రెటీలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు
ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ ను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ( మధురై బెంచ్) ఆదేశించింది. ఈ క్రమంలోనే సెలెబ్రెటీలకు చురకలంటించింది.
స్టార్ డమ్ ఉన్న వారు ఈ గేమ్స్ ను ప్రోత్సహించేలా ప్రకటనల్లో నటించడాన్ని తప్పుపట్టింది. వారివల్ల అభిమానులు, అమాయక ప్రజలు గేమ్స్ ఆడి డబ్బు పోగొట్టుకుంటున్నారని.. కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
టీమిండియా ఆటగాళ్లపై మధురై బెంచ్ విమర్శలు గుప్పించింది. లక్షలాది మంది అభిమానులు ఉన్న ఆటగాళ్లు ఆన్ లైన్ గేమ్స్ ను ప్రోత్సహిస్తూ అడ్వటైజ్ మెంట్లలో పాల్గొనడమేంటని ప్రశ్నించింది. వారిపై అభిమానుంతో అమాయక జనం ఈ ఆన్ లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పొగొట్టుకుంటున్నారని విమర్శించింది.
ఇప్పటికైనా సెలెబ్రెటీలు ప్రజలను ఇబ్బందులకు గురిచేసే యాడ్స్ లో పాల్గొనేటప్పుడు ఆలోచించుకోవాలని చురకలు వేసింది. ఆన్ లైన్ గేమ్స్ ప్రమోట్ చేయడంపై వివరణ ఇవ్వాలని గంగూలీ, కోహ్లీ సహా ప్రోత్సహించిన సెలెబ్రెటీలకు నోటీసులు జారీ చేసింది.
డ్రీమ్ 11, ఎంపీఎల్ ఆన్ లైన్ గేమ్స్ కి గంగూలీ, కోహ్లీ ప్రమోటర్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఆన్ లైన్ గేమ్స్ కట్టడికి ఇప్పటికే తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు చర్యలు చేపట్టింది.