కొన్ని అంశాలు మామూలు గా ఉన్నట్లు అనిపిస్తాయి కానీ లోతుల్లోకి వెళితే కానీ దాని కుంటే సంక్లిష్టత ఒక పట్టాన అర్థం కాదు. పురుషులకు.. మహిళలకు వేర్వేరుగా జైళ్లు ఉన్నాయి. మరి.. నేరాలకు పాల్పడే హిజ్రాల మాటేమిటి? వారిని ఏ జైల్లో ఉంచాలి? అన్న ప్రశ్న కు చటుక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో.. నేరాలు చేసిన హిజ్రాలను ఏ జైల్లో ఉంచాలన్న ధర్మ సందేహానికి తాజాగా మద్రాసు హైకోర్టు ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
ఒక కేసు విచారణలో భాగంగా తలెత్తిన ఈ ధర్మసందేహాన్ని తీరుస్తూ కింది కోర్టులకు మార్గదర్శనం చేసింది మద్రాస్ హైకోర్టు. తాజా మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను అనుచరించి పుదుచ్చేరిలోని సెషన్స్ కోర్టులకు హైకోర్టు కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది.
నేరాలకు పాల్పడిన కేసుల్లో అరెస్టు అయిన హిజ్రాలను వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. సదరు వైద్య అధికారిపరీక్షల్లో ఆడ లక్షణాలు ఎక్కువగా ఉంటే.. మహిళలు ఉండే జైళ్లల్లో.. పురుష లక్షణాలు ఎక్కువగా ఉంటే పురుష జైల్లో ఉంచాలని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితులు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయని.. అలాంటప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలో తేలుస్తూ ఆదేశాల్ని జారీ చేసింది.