మద్రాస్ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాలను వచ్చే మూడు నెలలపాటు తెరవొద్దని తీర్పును వెలువరించింది. సుప్రీం ఆదేశాలను తుంగలో తొక్కుతూ తమిళనాడు ప్రభుత్వం జాతీయ, రాష్ర్ట రహదారుల వెంబడి మద్యం దుకాణాలను నిర్వహిస్తుందని పేర్కొంటూ డీఎంకే పార్టీ, పట్టాలీ మక్కల్ కట్చి విభాగానికి చెందిన లీగల్ వింగ్ మద్రాస్ హైకోర్టులో పిల్ ను దాఖలు చేసింది. పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం వచ్చే మూడు నెలల పాటు మద్యం దుకాణాలను బంద్ చేయాల్సిందిగా ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 10వ తేదీకి వాయిదా వేసింది.
జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల వెంబడి 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి బంద్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ మార్చి 31న సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతూ యథేచ్చగా పలు షాపులు కొనసాగుతున్నాయి. దీంతో పలు రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేయగా తాజా నిర్ణయం వెలువడింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/