చచ్చిన పామును తిన్నవ్యక్తి అరెస్టు.. విచారణలో షాకింగ్ నిజం

Update: 2021-05-30 03:43 GMT
కరోనా పుణ్యమా అని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహకు అందని రీతిలో ఉన్న ఈ ఉదంతాలకు తగ్గట్లే తాజా ఉదంతం ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. మధురై జిల్లా పెరుమపట్టికి చెందిన 50 ఏళ్ల వడివేలు అనే వ్యవసాయ కూలీని అధికారులు అరెస్టు చేశారు. కారణం.. చచ్చిన పామును కసకసా తినేయటమే.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ హల్ చల్ చేశాయి.

దీంతో.. స్పందించిన అటవీ శాఖ అధికారులు ఆ వీడియోను పోలీసులకు పంపటంతో.. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ అతను చచ్చిన పాము ఎందుకు తిన్నాడు? అన్న ప్రశ్నకు సమాదానం తెలసుకునేందుకు విచారణ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అతగాడు చెప్పిన మాటలు షాకింగ్ గా మారాయి. చచ్చిన పామును తినాలని తనను కొందరు బలవంతం చేసినట్లు చెప్పాడు.

ఆ సమయంలో తాను మద్యం సేవించి ఉన్నానని.. దీంతో తనకు తెలీలేదన్నారు. పామును తింటే కొవిడ్ 19 రాదని..పాము వైరస్ కు విరుగుడుగా మారుతుందని చెప్పారన్నారు. అందుకే తనను తాను కాపాడేందుకు వీలుగా తాను చచ్చిన పామును తిన్నట్లుగా వివరణ ఇచ్చాడు. దీంతో అతడికి రూ.7వేలు ఫైన్ వేశారు. మరి.. చచ్చిన పామును తినటం ప్రమాదకరం కదా? అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదా? అన్న సందేహానికి సమాధానం వెతికితే.. పాము విషం ఉండే.. భాగాన్ని సదరు వ్యక్తి నోటితో తాకకపోవటంతో ఎలాంటి హాని జరగలేదని చెబుతున్నారు. ఏమైనా ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
Tags:    

Similar News