మాగుంట‌కు నెల్లూరు ఎంపీ టికెట్?

Update: 2019-03-04 09:16 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ తో పాటు.. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ మ‌రో రెండు.. మూడు రోజుల్లో వెలువ‌డుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్తమ‌వుతున్న వేళ‌.. పార్టీలు బ‌రిలోకి దింపే అభ్య‌ర్థుల వ్య‌వ‌హారంపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్ప‌టికే అధికార‌.. విప‌క్ష పార్టీలు వేటిక‌వే.. త‌మ అభ్య‌ర్థుల్ని ఎంపిక చేసే ప‌నిలో బిజీగా ఉన్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

గ‌తానికి భిన్నంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. జిల్లాల వారీగా స‌మీక్ష‌లు చేప‌ట్టి.. ఇబ్బందుల్లేని సీట్ల‌కు సంబంధించిన అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టిస్తున్నారు. చిక్కులు ఉన్న సీట్ల‌కు సంబంధించిన సీట్ల‌కు అభ్య‌ర్థుల్ని ఎంపిక చేయ‌కుండా.. త‌ర్వాత ప్ర‌క‌టిస్తాన‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. మ‌రోవైపు అధికార‌ప‌క్షంపై ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న అసంతృప్తి నేప‌థ్యంలో టీడీపీకి చెందిన ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో.. ఏపీ రాజ‌కీయాల్లో ఎప్పుడేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. ఇదిలా ఉంటే తాజాగా నెల్లూరు ఎంపీ టికెట్ కు సంబంధించి  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు  నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.

నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా సీనియ‌ర్ నేత మాగుంట‌ను క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌కాశం.. నెల్లూరు జిల్లాలో మంచి పేరున్న మాగంట‌ను నెల్లూరు ఎంపీ టికెట్ కేటాయించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.


Tags:    

Similar News