ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మరోమారు తన సత్తా చాటింది. ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయం సాధించారు. మొత్తం 755 ఓట్లలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కి 717 ఓట్లు దక్కగా ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థి చిన వెంకటరెడ్డికి కేవలం 17 ఓట్లే దక్కాయి. మిగిలిన ఓట్లు చెల్లలేదు.
ఎంపీటీసీలను టీడీపీ ప్రలోభ పెడుతోందని, పార్టీ పిరాయింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ వైసీపీ ఈ ఎన్నికలను బహిష్కరించింది.
మాగుంట గత ఎన్నికల వరకు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం స్థానాలు ఏకగ్రీవం అయినప్పటికీ ప్రకాశం, కర్నూలు జిల్లాలోని వాటికే ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.