మహానాడు : టీడీపీ నాటిన విత్తనాలు... వైసీపీ వాళ్లూ ఈ లిస్టులో ఉన్నారు

Update: 2022-05-27 05:30 GMT
ఇవాళ్టి నుంచి రెండ్రోజుల పాటు మ‌హానాడు జ‌ర‌గ‌నుంది. ప్ర‌తిష్టాత్మ‌క ప‌సుపు పండుగ‌కు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. మ‌హానాడు అంటే తెలుగు జాతి పండుగ అన్న‌ది  ఆ పార్టీ పెద్ద‌ల అభివ‌ర్ణ‌న. ఆ రోజు ఎన్టీఆర్ సార‌థ్యం నుంచి నేటి చంద్ర‌బాబు నేతృత్వం వ‌ర‌కూ పార్టీలో ఎన్నో మార్పులు వ‌చ్చేయి.

సంక్షోభాల‌ను దాటి, ఓట‌ముల‌ను దాటి ఎదిగి వ‌చ్చిన క్ర‌మంలో శ్రీ‌కాకుళం నేత‌లున్నారు. వారిలో ముఖ్యులు ఎన్టీఆర్ ను అతి ద‌గ్గ‌రగా చూసి, అర్థం చేసుకుని ఆయ‌న‌తో ప్రయాణించిన వారు సిక్కోలు నేత‌లు. ఎర్ర‌న్నాయుడు, గౌతు శ్యామ సుంద‌ర శివాజీ, ఇప్ప‌టి స్పీక‌ర్ అప్ప‌టి కీలక నేత అయిన త‌మ్మినేని సీతారాం, ప్ర‌తిభా భార‌తి (అప్ప‌టి స్పీక‌ర్) ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఎంద‌రో !

ముఖ్యంగా ఎర్ర‌న్నాయుడు లాంటి బీసీ లీడ‌ర్ల‌కు మంచి రాజకీయ జీవితాన్నిచ్చిందే తెలుగు దేశం పార్టీ. తొలుత ఆయ‌న ఆ పార్టీతో విభేదించారు. కానీ త‌రువాత కాలంలో ఆయ‌న పార్టీలో నిల‌దొక్కుకుని నాయ‌కుడిగా రాణించారు. దేశ రాజ‌కీయాల్లో పేరు తెచ్చుకున్నారు. ఓ సామాన్య ఉపాధ్యాయుడి కుటుంబంలో పుట్టి, కొద్దిపాటి చ‌దువుతోనే ఆయ‌న రాణించారు. ఎన్టీఆర్ నుంచి చంద్ర‌బాబు వ‌ర‌కూ ఆయ‌న ప్ర‌యాణం చాలా అంటే చాలా బాగుంది. శివాజీ ఆయ‌న స్నేహితులు. వీళ్లిద్ద‌రినీ ఆ రోజుల్లో ఉద్దానం బ్ర‌ద‌ర్స్ అనేవారు. ఇద్ద‌రికీ ఒకే లెట‌ర్ హెడ్ ఉండేది.

అప్పట్లో హ‌రిశ్చంద్ర పురం నియోజ‌క‌వ‌ర్గం త‌ర‌ఫున ఎర్ర‌న్న‌, సోంపేట త‌ర‌ఫున శివాజీ రాజ‌కీయం న‌డిపేవారు. కాల గ‌తిలో ఎర్ర‌న్నాయుడు ఊహించ‌ని స్థాయిలో దేశ రాజ‌కీయాల్లో పేరు తెచ్చుకున్నారు. హిందీ నేర్చుకుని పార్ల‌మెంట్ లో ప్ర‌సంగించారు.

త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఇంగ్లీషు నేర్చుకుని రాణించారు. ఆయ‌న కృషి ఫ‌లితంగానే ఉద్దానంకు ర‌క్షిత మంచి నీటి ప‌థ‌కం ద‌క్కింది. ఎన్డీఏ హ‌యాంలో గ్రామీణాభివృద్ధి శాఖ‌కు స‌హాయ మంత్రిగా ప‌నిచేసిన రోజుల్లో ఆయ‌న ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం దిద్దారు. అదేవిధంగా ఇంకొంద‌రు కూడా తెలుగుదేశం పార్టీ నీడ‌లోనే  ఎదిగారు.

ఇప్ప‌టికీ సీతారాం కానీ ఇత‌ర నాయ‌కులు కానీ టీడీపీ నాయ‌కుల‌తో మంచి బంధాలే కొన‌సాగిస్తున్నారు. పైకి వాగ్వాదాలు నెర‌పినా ఒక‌నాటి స్నేహాలు అంత వేగంగా కొట్టిపారేయ్య‌లేం. ఎర్ర‌న్న వారసుడు రామ్మోహ‌న్ నాయుడుని కానీ ఆయ‌న బిడ్డ..భ‌వానీని కానీ స్పీక‌ర్ ఎంత‌గానో ప్రోత్స‌హిస్తారు. వాళ్లు కూడా అదే రీతిలో ఆయ‌న‌ను గౌర‌విస్తారు. ఇక క‌ళా వెంక‌ట్రావు లాంటి లీడ‌ర్లు ఇప్ప‌డియితే మునుప‌టి ఛార్మింగ్ ను కొన‌సాగించ‌లేక‌పోయినా ప‌ద‌వుల రీత్యా మంచి గౌర‌వాన్నే అందుకుని గుర్తింపు పొందారు.
Tags:    

Similar News