ప్రిన్స్ ఎలిజిబెత్ 2 మరణం నేపథ్యంలో బ్రిటన్ కు రాజు కాబోతున్నారు చార్లెస్ 3. డెబ్భై ఏళ్ల తర్వాత బ్రిటన్ కు కొత్త రాజు ఛార్జ్ తీసుకోనున్నారు. సాధారణంగా రాజు అధికారంలోకి వస్తే.. ఆటోమేటిక్ గా ఆయన సతీమణి రాణి అయిపోతారు. కానీ.. చార్లెస్ 3 సతీమణి క్యామిల్లా మాత్రం మహరాణి కాకుండా అధికారాలు లేని మహరాణిలా మాదిరే ఉండబోతున్నారు. తల మీద కీర్తి కిరీటం ఉన్నప్పటికీ.. ఉత్త మహరాణి అన్న ట్యాగ్ తోనే ఆమె జీవించాల్సి ఉంటుంది. ఎందుకిలా? అంటే.. అందుకు బోలెడన్ని కారణాలు ఉన్నాయి. అన్నింటికి మించి చార్లెస్ 3 రెండో భార్య కావటం ప్రధాన కారణంగా చెబుతారు. దీనికి తోడు బోలెడన్ని అంశాలు ఉండటం కూడా మరో కీలకాంశం.
అభ్యంతరాలన్ని ఆమెకే ఎందుకు? 75 ఏళ్ల వయసున్న క్రెమిల్లా యూనైటెడ్ కింగ్ డమ్ కు కొత్త మహరాణి అయినప్పటికి.. ఆమెకు మాత్రం రాణి హోదా ఉండదు. క్వీన్ కాన్సోర్ట్ (అంటే రాజు భార్య) గా మాత్రమే హోదా ఉండనుంది. రాణి హోదాలో రాజరికంలోకి అడుగుపెట్టే వారికి రాజుతో పాటు సమానమైన హోదా దక్కుతుంది. సౌర్వభౌమాధికారంతో పాటు రాజకీయ అధికారాలు.. సైన్యాధికారాలు ఉంటాయి. ఆనవాయితీగా వచ్చేవేవీ క్రెమిల్లాకు మాత్రం దక్కే ఛాన్సే లేదంటున్నారు.
చార్లెస్ మొదటి భార్య ప్రిన్సెస్ డయానా 1997లో రోడ్డు ప్రమాదంలో మరణించటం తెలిసిందే. ఆమె మరణంపై బోలెడన్ని అనుమానాలు ఉన్నాయి. వీరి విడాకులకు ముందు ఛార్లెస్ క్యామిల్లాతో ప్రేమాయణం సాగించారు. అంటే.. పెళ్లై భార్య ఉన్నప్పటికీ చార్లెస్ క్యామిల్లాలో రిలేషన్ మొయింటైన్ చేశారు. ఈ కారణంతోనే డయానాతో విడాకులు తీసుకున్నారు. డయానా మరణం తర్వాత దాదాపు ఎనిమిదేళ్లు అంటే 2005లో క్యామిల్లాను పెళ్లాడారు. డయానా విడాకులకు.. మరణానికి క్రెమిల్లానే కారణమన్న భావన బ్రిటన్ సమాజం నుంచి వస్తూనే ఉంది. అయితే.. చార్లెస్ తో అన్యోన్యంగా ఉండటం.. సింపుల్ గా ఉంటూ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా.. సంచలనాలకు దూరంగా ఉండటం కారణంగా కొంతపాటి సానుభూతిని మాత్రం ఆమె సొంతం చేసుకున్నారు.
వాస్తవానికి ఆమెకు డయానా స్థానంలో ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ హోదా ఇవ్వాలి కానీ తీవ్ర అభ్యంతరాల నడుమ డచ్చెస్ ఆఫ్ కార్నివాల్ (రాజు భార్య) ను మాత్రమే ఇచ్చారు. క్యామిల్లా విషయానికి వస్తే ఆమె పూర్తి పేరు క్యామిల్లా రోజ్ మేరీ షాండ్. 1947లో పుట్టిన ఆమెకు బ్రిటన్ రాజకుటుంబంతో చాలాకాలం ఆమెకు సంబంధాలు ఉన్నాయి. ఆమె వంశానికి చెందిన ఎలైస్ కెప్పెల్.. కింగ్ ఎడ్వర్డ్ 7తో ప్రేమాయణం నడిపించినట్లు చెబుతారు. 1970లో ఒక పోలో మ్యాచ్ సందర్భంగా చార్లెస్.. క్యామిల్లా తొలిసారికలుసుకున్నారు. అప్పటికి ఆమె వయసు 23 ఏళ్లు మాత్రమే.
ఛార్లెస్ కు నేవల్ డ్యూటీ కారణంగా వారి రిలేషన్ కు కొంతకాలం బ్రేక్ పడింది. ఆ గ్యాప్ లో తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ పార్కర్ బౌల్స్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో ఛార్లెస్ తనకు క్యామిల్లాకు ఎఫైర్ ఉందని ఓపెన్ కావటంతో ఆయన డయానాకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. విడాకులు ఇచ్చాక డయానా ఒక రోడ్డు ప్రమాదంలో మరణించటంతో ఆమె మరణంపై అనుమానాలు.. రాజకుటుంబంపై విమర్శలు వెల్లువెత్తాయి.
డయానా మరణించిన తర్వాత క్యామిల్లాను చార్లెస్ పెళ్లాడారు. వీరి వివాహం చాలా సింఫుల్ గా ముగిసింది. అప్పటి నుంచి ఆమెకు రాయల్ డ్యూటీస్ మొదలయ్యాయి. తొంభైకి పైగా ఛారటీలకు ఆమె గౌరవ అధ్యక్షత వహిస్తున్నారు. చక్కగా సాగిపోతున్న ఛార్లెస్ - డయానా కాపురంలో నిప్పులు పోసిన విలన్ గా క్రెమిల్లా నిలిచారు. ఇప్పటికి డయానా మరణానికి ఆమె పరోక్ష కారణమన్న కోపం కొంత ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
తన తర్వాత తనకు దక్కిన ఆదరణే..రాజు అయ్యే చార్లెస్ కు అతని భార్య క్యామిల్లాకు దక్కాలన్నది క్వీన్ ఎలిజిబెత్ కోరిక కూడా. తన 70 ఏళ్ల పాలనా వార్షికోత్సవం సందర్భంగా ఆమె నోటి నుంచి ఇదే అభిలాష వచ్చింది. ఈ సందర్భంలోనూ క్వీన్ ఎలిజిబెత్ క్యామిల్లాను ప్రిన్సెస్ కాన్సోర్డ్ అనే పదాన్ని నొక్కి పలకటం గమనార్హం. ఈ కారణంతోనే ప్రస్తుతం క్వీన్ అయినప్పటికీ క్యామిల్లా.. ఇంతకు ముందులాగే కేవలం రాయల్ డ్యూటీస్ కు మాత్రమే పరిమితం కానుంది. మహరాణి.. కీర్తి కిరీటం నెత్తిన ఉన్నా.. అధికారాలు లేని ఉత్త రాణి.. అదే రాజుగారి భార్య మాత్రమే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.