ఆలిండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీకి భారీ షాక్ తగలింది. పాతబస్తీకే పరిమితమైన పార్టీని పక్క రాష్ర్టాలకు కూడా విస్తరించాలనుకున్న ఓవైసీ దూకుడుకు మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ బ్రేకులేసింది. ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీగా ఎంఐఎంకు ఉన్న గుర్తింపును బుధవారం రద్దు చేసింది. పార్టీకి సంబంధించిన నిధులు - ఆదాయ వివరాల పత్రాలు దాఖలు చేయాల్సిందిగా పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆ పార్టీ స్పందించలేదని - దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ ప్రకటించింది. తద్వారా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని మజ్లిస్ పార్టీ కోల్పోయింది.
ఎన్నికల కమిషన్ నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని, దీని వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉండవచ్చని ఎంఐఎం పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మూడేళ్ల ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సహా అన్ని పత్రాలను ఎన్నికల కమిషన్ కు అందజేశామని వివరిస్తున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో రెండు సీట్లు గెలవడంతోపాటు నాందేడ్ - ఔరంగాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. ఇటీవలే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంతియాజ్ వివాదాస్పద ప్రొఫెసర్ జకీర్ కు మద్దతిచ్చారు.
ఏఐఎంఐఎం తరఫున మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యే ఇంతియాజ్ జలీల్ ఒక ప్రకటనలో జకీర్ కు పెద్ద ఎత్తున మద్దతిచ్చారు. జకీర్ విషయంలో భారతదేశ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. కోర్టు తీర్పు వచ్చే వరకూ ఎవరినీ కూడా దోషులుగా పరిగణించడానికి వీలులేదని మీడియాకు సుద్దులు చెప్పారు. అందుకే జకీర్ నాయక్ పై మీడియా దర్యాప్తు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఇకనైనా మీడియా దూకుడు తగ్గించుకుంటే మంచిదని కూడా ఆయన సూచించారు.