ప్రభుత్వంలోని వ్యవస్థలు వేటికవే పని చేస్తుంటాయి. కానీ.. వాటి మధ్య సమన్వయ లోపం లాంటివి కొన్ని ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. సాధారణంగా ఎవరైనా పౌరుడు బిల్లు బకాయి పడితే ప్రభుత్వ సంస్థలు తాట తీస్తుంటాయి. అలాంటి చర్యలు తీసుకునే ప్రభుత్వం తనకు తానే బకాయిలు చెల్లించకుండా ఉండడటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
తాజాగా ఒక సహ కార్యకర్త పెట్టుకున్న దరఖాస్తులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారిక నివాసం గడిచిన కొన్నేళ్లుగా నల్లా బిల్లుకట్టటం లేదని.. ఇప్పుడు దీని బకాయి ఏకంగా రూ.7లక్షలు దాటినట్లు చెబుతున్నారు. దీంతో.. సీఎం బంగ్లాను ఎగవేతదారు లిస్ట్ లో చేరింది.
ముంబయిలోని మలబార్ హిల్స్ లో ఉండే ఫడ్నవీస్ అధికారిక నివాసం వర్షా బంగ్లా 2001 నుంచి నీటి బిల్లులు చెల్లించటనట్లుగా తేలింది. రాష్ట్రానికి పాలకుడైన ముఖ్యమంత్రి అధికారిక నివాసమే ప్రభుత్వానికి బకాయి పడటం ఒక ఎత్తు అయితే.. బకాయిదారుగా సీఎం పేరు చేయటం అధికారుల తప్పిదంగా చెప్పకతప్పదు. ఈ దరఖాస్తు పుణ్యమా మరో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. ముఖ్యమంత్రి ఒక్కరేకాదు పలువురు మంత్రుల అధికారిక నివాసాలకు చెందిన వాటర్ బిల్లును చెల్లించలేదన్న నిజం బయటకు వచ్చింది. మరికొద్ది నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ.. ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంత భారీగా ఉండటం ప్రతికూలంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.
మరి.. ఇప్పటికైనా కళ్లు తెరిచి బకాయిలు క్లియర్ చేస్తారా? అలానే కంటిన్యూ చేస్తారా?