ఎంతవారలైనా కాంత దాసులే అంటారు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన అమ్మాయిని చూస్తే గుండె లయ తప్పడం.. ప్రేమలో పడటం లాంటి ఉండవనుకుంటే పొరబాటే. ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కు కూడా ప్రేమకథ ఉందట. ఆయనది ప్రేమ వివాహమేనట. ఐతే తన భార్య అమృతను చూసి పడిపోవడానికి కారణం మాత్రం బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అట. దేవేంద్ర ఫడ్నవీస్ కాజోల్ కు చాలా ఇష్టమట. అమృత చూడ్డానికి కాజోల్ లాగే ఉండటంతో ఆమెను ఇష్టపడినట్లు దేవేంద్ర ఫడ్నవీస్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నాగపూర్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చారూ రనాడె.. డాక్టర్ శరత్ రనాడెల కూతురు అమృత రనాడె.
ఓ సందర్భంలో దేవేంద్ర అమృతను చూసిన కాసేపటికే.. ‘నువ్వు కాజోల్ లాగా ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని అడిగేశాడట. ఐతే మొదట అమృత.. దేవేంద్ర ప్రపోజల్ ను ఒప్పుకోలేదట. అప్పటికే దేవేంద్ర ఎమ్మెల్యేగా ఉండటం విశేషం. ఐతే ముందు కాదన్నప్పటికీ.. తర్వాత నెమ్మదిగా ఆమె మనసు మారింది. ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రి భార్యగా గొప్ప గౌరవాన్ని అందుకుంటోంది. అమృత క్లాసికల్ డ్యాన్సర్. యాక్సిస్ బ్యాంకులో ఉన్నతోద్యోగి. ఇరు కుటుంబాలు అంగీకరించాక వీరి పెళ్లిని నాగ్ పూర్లో ఘనంగా చేశారు. వీళ్లిద్దరికి ప్రస్తుతం దేవిజ అనే చిన్న కూతురు ఉంది. రాజకీయాల్లో తన ఎదుగుదలకు అమృత ఎంతో తోడ్పడ్డారని దేవేంద్ర చెబుతుంటారు.