అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆయన పుత్రరత్నం వ్యవహరించిన తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. విమర్శలు ఎదురవుతాయన్న విషయాన్ని పట్టించుకోకపోవటమో.. తండ్రి చేతిలో ఉన్న పవర్ బాగా తలకు ఎక్కేసినట్లుగా పరిస్థితి ఉందన్న విమర్శ వినిపిస్తోంది.
మహారాష్ట్ర సచివాలయంలో సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఏక్ నాథ్ షిండే కొడుకు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికి ఉన్న వివాదాలు సరిపోనట్లుగా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తలపోటుగా మారింది ఆయన పుత్రరత్నం వైఖరి. ఇదేదో ఆరోపణ మాదిరి కాకుండా.. సీఎం కుర్చీలో కూర్చున్న ఫోటో కూడా బయటకు రావటం.. సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఇదో ఇష్యూగా మారింది. తాజా పరిణామాలపై స్పందించిన ఎన్సీపీ 'సూపర్ సీఎం' అంటూ టైమ్లీ సెటైర్ వేసింది.
బయటకు వచ్చిన తాజా ఫోటోలో.. ముఖ్యమంత్రి ఛాంబర్ లో ఆయన కుర్చీలో కూర్చున్న ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే తన మొబైల్ చూసుకోవటంలో బిజీగా ఉండటం ఫోటోలో కనిపిస్తూ ఉంటుంది. అంతే కాదు.. ఆయనకు ఒక పక్కన ఒక అధికారి.. టేబుల్ ముందు మరో అధికారం ఉండటం కనిపిస్తుంది.
ఆయన చేతుల కింద ఏదో ఒక పేపర్ ఉన్న వైనం ఫోటోలో కనిపిస్తోంది. శ్రీకాంత్ షిండే లోక్ సభ సభ్యుడిగా మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటం తెలిసిందే.
ఎంత ఎంపీ అయితే మాత్రం.. తండ్రి కూర్చునే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటం ఏమిటి? అంటూ పలువురు ఈ తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి.. హద్దులు దాటిన తన కొడుకుపై సీఎం ఏరీతిలో రియాక్టు అవుతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.