మహారాష్ట్రలో పొత్తుల సంసారంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీతో విడిపోయి బయటకొచ్చిన శివసేనకు సీఎం కుర్చీ కట్టబెట్టారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కాంగ్రెస్ ను కబళించేందుకు రెడీ అవుతున్నాయన ఎన్సీపీ , శివసేనలు.. ఈ మాట అన్నది ఎవరో కాదు.. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలే..
మహారాష్ట్ర కాంగ్రెస్ శాఖ తాజాగా తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సంచలన లేఖ రాశారు. మహావికాస్ అగాఢీలోని శివసేన, ఎన్సీపీలు కాంగ్రెస్ ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని సోనియాకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ను పూర్తిగా పక్కనపెట్టేస్తున్నారని సోనియా దృష్టికి తీసుకెళ్లారు.
ఎన్సీపీలు, శివసేనలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని.. చెదల్లా పాడుచేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. ముంబై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విశ్వబంధు రాయ్ ఈ మేరకు సోనియాకు లేఖ రాశారు.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీని కూడా మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం నెరవేర్చడం లేదని..కాంగ్రెస్ లోని నేతలు ఎన్సీపీలోకి వలస వెళుతున్నారని.. దాన్ని నిరోధించాలని లేఖలో పేర్కొన్నారు. సంకీర్ణ ధర్మ పాటించేలా శివసేన, ఎన్సీపీలకు సూచించాలని లేఖలో సోనియాగాంధీని కోరారు.