ఇక తాగి దొరకరు.. ఇంటికే మద్యం..

Update: 2018-10-16 01:30 GMT
ఆన్ లైన్ షాపింగ్ మాదిరిగా మద్యం కూడా ఇంటికే రానుంది. కేవలం ఒక్క ఆర్డరిస్తే చాలు. మద్యం ప్రియుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశ పెట్టబోతుంది.  మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యను తగ్గించడానికి ఇది సరైన నిర్ణయమని పేర్కొంటోంది.

ఎన్నికల్లో పోటీలు పడి మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్న కొన్ని పార్టీలు, వాస్తవానికి అది సాధ్యం కాదని తెలుసు. లిక్కర్ తీసుకోవడం ఇప్పుడు అందరు సర్వసాధారణంగా భావిస్తున్నారు. లింగ బేధాలు, వయసుతో సంబంధం లేకుండా మద్యం సేవిస్తున్నారు.

ఈ క్రమంలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు కూడా బాగా పెరిగాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య కూడా కొంచెం ఎక్కువగానే ఉందట. ఇందుకు విరుగుడుగా మహా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. ఆన్ లైన్ లో మద్యం ఆర్డర్ ఇస్తే చాలు.. ఇంటికే వచ్చేలా పథకాన్ని రూపొందించనున్నట్లు తెలిపింది. విధివిధానాలు ఇలా ఉండబోతున్నాయన్న ఆ రాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవాంకులే వెల్లడించారు.

మద్యం బుక్ చేసుకేందుకు 21 ఏళ్లు తప్పకుండా ఉండాలని, ఐఎంఎఫ్ఎల్ దేశీ మద్యం బుక్ చేసుకోవాలంటే 25 ఏళ్లు ఉండాలని మంత్రి చంద్రశేఖర్ బవాంకులే తెలిపారు. పర్మిషన్ లేకుండా మద్యం విక్రయిస్తే రూ.5000 నుంచి రూ.25000 వరకు జరిమానా, లేక 6 నెలల జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. నేషనల్ క్రేమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2015లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.5 శాతం మంది మద్యం తాగి వాహనాలు నడిపి చనిపోయిన వారు ఉన్నారని పేర్కొన్నారు. జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసి బుక్ చేసుకున్న మద్యం ఎవరి చేతుల్లోకి వెళ్తుందో తెలుసుకునేందుకు నిఘా ఉంటుందని చెబుతున్నారు.  ఈ పథకం మద్యం ప్రియులకు  ఎంతో ఉత్సాహన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News