అంగరంగ వైభవంగా గోదావరి పుష్కరాల్ని నిర్వహించాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరేలా లేదు. కుంభమేళా స్థాయిలో గోదావరి పుష్కరాల్ని నిర్వహించాలని ఆయన భావించారు.అయితే.. వర్షాలు లేకపోవటం.. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి గోదావరి బేసిన్ నీటిని విడుదల చేయకపోవటంతో.. పలు జిల్లాల్లోని గోదారమ్మ నీరు లేక వెలవెలబోతోంది.
అయితే.. పుష్కరాల నేపథ్యంలో నీటిని విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఫోన్ చేశారు. రెండుసార్లు ఫోన్ చేసి.. నీరు విడుదల కోరినా.. దేవేంద్ర నీటి విడుదలకు నిరాకరించారు. నీటి విడుదల కోసం మహారాష్ట్ర గవర్నర్ తోనూ కేసీఆర్ రాయబారం నడిపారు. చివరకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రంగంలోకి దిగినా ప్రయోజనం లేకపోయింది.
పుష్కరాలకు నీటిని విడుదల చేయాల్సి ఉన్నా.. తమ ప్రాజెక్టుల్లోనే తాగు.. సాగునీటి అవసరాలకు తగిన నీరు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. నీటి విడుదల చేయలేమన్న నిస్సహాయతను వ్యక్తం చేవారు. నీటి విడుదల చేసినా.. అవి గోదావరి స్నాన ఘట్టాల వరకూ వస్తాయన్న నమ్మకం లేని నేపథ్యంలో.. నీటి విడుదల మహారాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బ తీస్తుందని.. అందుకే విడుదల చేయలేమని తేల్చి చెప్పారు. ఒకవేళ వర్షాలు కురిస్తే మాత్రం నీటిని విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. దీంతో.. మహారాష్ట్ర నుంచి వచ్చే నీటితో గోదారి కళకళలాడుతుందని భావించిన ఆశ.. నిరాశ అయ్యింది. అయితే.. పుష్కర ఘాట్లలో నీరు లేని నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి రోజూ 3వేల క్యూసెక్కులతో పాటు.. గోదారిలో బోర్లు వేయటం ద్వారా నీటిని బయటకు వదిలే పని చేస్తున్నారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా.. నీరు లేక పుష్కర ఘాట్లు వెలవెలబోతున్న పరిస్థితి.