కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో రోజురోజుకి ఊహించని విదంగా పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే 352 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 ,337కి చేరుకున్నాయి. అలాగే సోమవారం ఒక్కరోజే 11 మంది చనిపోయారని మహారాష్ట్ర అధికారులు తెలిపారు. మహారాష్ట్ర రాజధాని ముంబై లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. 1549 కేసులు రిపోర్ట్ కావడం ఆందోళన కలిగించే అంశం.
అలాగే సోమవారం మహారాష్ట్రలో 11 మంది చనిపోగా.. ముంబైలోనే 9 మంది చనిపోయారు. వీరితో కలిపి మహారాష్ట్ర లో మృతుల సంఖ్య 149కి చేరింది. సోమవారం ముంబైలో 150 పాజిటివ్ కేసులు ఒక్క ముంబైలోనే రికార్డయ్యాయి. దీంతో సిటీలో వైరస్ పాజిటివ్ కేసులు 1619కి చేరుకున్నాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో దేశ ఆర్థిక రాజధాని అల్లాడిపోతున్నది. మరోవైపు తమిళానాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే చెన్నైలో 200 పాజిటివ్ కేసులు రావడం భయాందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఏడు జిల్లాల్లో హై అల్టర్ట్ విధించారు. ఇకపోతే , ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 10వేలు దాటగా, మృతుల సంఖ్య 300 కి చేరింది. ఇకపోతే తాజాగా మోడీ భారత్ లో మే 3 వరకు లాక్ డౌన్ పొడగిస్తునట్టు ప్రకటించారు.