ప్రతీకారం తప్పదు.. మావోయిస్టుల హెచ్చరిక

Update: 2021-11-14 11:30 GMT
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు స్పందించారు. ఎన్ కౌంటర్ బూటకమని.. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని లేఖ విడుదల చేశారు. తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

పోలీసులే ఇన్ఫార్మర్ల వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారు. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాల సమన్వయంతోనే ఎన్ కౌంటర్ జరిగిందన్నారు.

 మహారాష్ట్రలో మావోయిస్టులకు నిన్న భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరికొందరికి గాయలయ్యాయని సమాచారం. గడ్చిరోలి జిల్లా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో 26మంది మావోయిస్టులు హతమైనట్టు సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

మావోయిస్టుల కాల్పుల్లో పోలీసులు కూడా గాయపడినట్టు సమాచారం. ఎన్ కౌంటర్ లో నక్సల్స్ భారీగా చనిపోయినట్టు తెలుస్తోంది. ఇది మావోలకు భారీ ఎదురుదెబ్బగా చెబుతున్నారు.

నిఘా వర్గాల సమాచారంతో మావోయిస్టు కోసం భద్రతా బలగాలు గ్యారపట్టి ప్రాంతంలో గాలిస్తుండగా ఈ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరగ్గా మావోయిస్టులు భారీ సంఖ్యలో గాయపడ్డారని తెలుస్తోంది.

గ్యారబట్టి అటవీ ప్రాంతంలోని ధానోరా వద్ద ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం భద్రతా బలగాలపై తొలుత మావోయిస్టులు కాల్పులు జరిపారు.దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించారు. సీఆర్పీఎఫ్, మహారాష్ట్ర పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.
Tags:    

Similar News