‘ఠాక్రే’ను.. మీ అయ్య జాగీరా అనేశాడే

Update: 2016-03-10 15:35 GMT
కొందరితో వియ్యం లేకున్నా కయ్యం మాత్రం పెట్టుకోకూడదు. అందులోకి రాజ్ ఠాక్రే లాంటి ఫైర్ బ్రాండ్ నేతలతో తగువు పెట్టుకుంటే వ్యవహారం ఎక్కడికో వెళుతుంది. మరి.. ఏమనుకున్నారో ఏమో కానీ.. బీహార్ ఉప ముఖ్యమంత్రి కమ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ చెలరేగిపోయాడు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే.. మహారాష్ట్రలోని ఆ రాష్ట్రేతర ఆటోరిక్షాలపై గుస్సా కావటం.. త్వరలో పెద్ద ఎత్తున కొత్త ఆటోలకు పర్మిషన్లు ఇవ్వనున్నట్లు తెలిసిందని.. ఈ విషయంలో మరాఠాలకు నష్టం జరిగేలా చేస్తే మాత్రం.. వేలాది ఆటోల్ని తగలబెడతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలు ఇప్పటికే సంచలనం సృష్టిస్తే.. దీనిపై అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యాడు తేజస్వి యాదవ్. మహారాష్ట్ర ఎవరి అయ్య జాగీరు కాదంటూ చెలరేగిపోయిన ఆయన.. ఆ విషయాన్ని రాజ్ ఠాక్రే గుర్తిస్తే మంచిదంటూ మండిపడ్డాడు. అంతేకాదు.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న రాజ్ ఠాక్రేపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోడీని డిమాండ్ చేస్తూ కొత్త మెలిక పెట్టారు.

మరాఠాల తరఫున పెద్ద ఎత్తున గళం వినిపించే రాజ్ ఠాక్రే వాదనకు ఇప్పటివరకూ ఎదురు మాట్లాడింది లేదు. అలాంటిది మహారాష్ట్రలోని మరాఠాతేరుల విషయంలో గళం విప్పిన లాలూ పుత్రరత్నం కారణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు చర్చగా మారింది.
Tags:    

Similar News