కేంద్రమంత్రిగా ఫడ్నవీస్..మహారాష్ట్రకు కొత్త సీఎం?

Update: 2017-03-14 08:57 GMT
యూపీలో సాధించిన అద్భుతమైన గెలుపు ఊపుతో ప్రధాని మోడీ త్వరత్వరగా మార్పులు చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు.. తాను మరింత బలపడేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ ను మళ్లీ గోవాకు ముఖ్యమంత్రిగా పంపిస్తున్న సంగతి తెలిసిందే. పారికర్ స్థానంలో అరుణ్ జైట్లీకి రక్షణ మంత్రి బాధ్యతలు అప్పగించారు. అయితే.. జైట్లీ ఇప్పటికే ఆర్థిక మంత్రి కావడంతో రెండు కీలక శాఖల బాధ్యతలు ఒక్కరే చూడడం కరెక్టు కాదు - సాధ్యం కాదు కాబట్టి జైట్లీ వద్ద ఉన్న ఆ రెండు శాఖల్లో ఏదో ఒకటి ఇతరులకు ఇస్తారని తెలుస్తోంది. ఇదేసమయంలో కేంద్ర మంత్రివర్గంలోకి మహారాష్ర్ట సీఎం ఫడ్నవీస్ ను తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుండడంతో చాలా సమీకరణాలు మారనున్నట్లు తెలుస్తోంది.
    
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకునే అవకాశాలున్నాయని ఢిల్లీవర్గాల్లో వినిపిస్తోంది.  మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వేరొకరిని నియమించి, ఫడ్నవీస్‌ను కేంద్రంలోకి తీసుకోవాలని బిజెపి అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.  కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ తన పదవికి రాజీనామా చేసి, గోవా రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఫడ్నవీస్‌ ను కేంద్రంలోకి తీసుకోనున్నారని చెబుతున్నారు.
    
రక్షణ శాఖను జాతీయ స్థాయి అనుభవంతో సంబంధంలేకుండా సామర్థ్యాల ప్రాతిపదికగా అప్పట్లో గోవా సీఎంగా ఉన్న పారికర్ కు అప్పగించారు. ఇప్పుడు మళ్లీ ఆయన్ను అక్కడి అవసరాల నేపథ్యంలో సీఎంగా పంపిస్తుండడంతో ఆ స్థానాన్ని ఇంకో విధేయుడైన, సమర్థుడైన సీఎం ఫడ్నవీస్ తో భర్తీ చేస్తారని టాక్. మొత్తానికి మోడీ వ్యూహాలే వేరు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News