మహారాష్ట్రలో వైరస్ పంజా విసురుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ముంబై, పూణే నగరాలతోపాటుగా, పలు ప్రధాన పట్టణాలలో ఈ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.మహారాష్ట్ర పోలీస్ శాఖలోనూ, జైళ్ళలోనూ పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు ఆందోళనకరంగా మారాయి. ఇదే సమయంలో జైళ్ళలో పరిస్థితిపై విచారణ జరిపిన ముంబై కోర్టు వైరస్ కంట్రోల్ కోసం కీలక ఆదేశాలు ఇచ్చింది.
మహారాష్ట్రలోని జైళ్ళు కరోనా కేంద్రాలుగా మారుతున్నా మహమ్మారి కట్టడిలో మాత్రం తీవ్రంగా విఫలమవుతోంది మహా సర్కార్. ఇప్పటివరకు మహారాష్ట్రలోని జైళ్లలో 363 మంది ఖైదీలు, 102 మంది జైలు అధికారులకు పాజిటివ్ గా తేలినట్లు తెలుస్తుంది. ముంబై నగరంలోని సెంట్రల్ జైలు లో అత్యధికంగా 181 మంది ఖైదీలు, 44 మంది జైలు సిబ్బందికి వైరస్ సోకింది. ముంబై తో పాటు తలోజా సెంట్రల్ జైలు , థానే సెంట్రల్ జైల్, బైకుల్లా జిల్లా జైలు, ఎరవాడ సెంట్రల్ జైలు, ఔరంగాబాద్ సెంట్రల్ జైల్, సతారా జిల్లా జైలు, షోలాపూర్, అకోలా , రత్నగిరి, ధూలే జిల్లా జైళ్లలో ఖైదీలు వైరస్ బారిన పడ్డారని మహారాష్ట్ర జైళ్ల శాఖ వెల్లడించింది.
భారిగా పెరుగుతున్న కేసులతో జైల్లో ఉన్న ఖైదీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర జైళ్లలో ఉన్న పరిస్థితిపై ముంబై హైకోర్టు దృష్టికి తీసుకు వెళుతూ వైరస్ కేసులు తీవ్రత పెరిగిన దృష్ట్యా ఖైదీల ఆరోగ్య రక్షణపై పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు జైళ్ల శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది.మహారాష్ట్ర ఖైదీలకు ర్యాండమ్ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దాదాపు 27 జిల్లాలలో ఉన్న తాత్కాలిక జైళ్ళ వివరాలను ఇవ్వాలని వాటిని తాత్కాలిక కరోనా సంరక్షణ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.