తెలంగాణ అభివృద్ధి పక్క రాష్ట్రాల ప్రజలను ప్రభావితం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వ కీర్తిని ఈ సంఘటనలు ఇనుమడింప చేస్తున్నాయి. కేసీఆర్ సర్కారు తెచ్చిన అద్భుతమైన పథకాలు, అభివృద్ధికి పక్క రాష్ట్రం ప్రజలు కూడా గులామై తాము తెలంగాణలో కలుస్తామంటూ ఉద్యమం లేవనెత్తడం తెలంగాణ సాధించిన ప్రగతికి నిదర్శనంగా చెప్పవచ్చు.
తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని ధర్మాబాద్ జిల్లాలోని శివారు 40 గ్రామాల సర్పంచులు, ప్రజలు, అఖిలపక్ష నేతలు తాజాగా భారీ ర్యాలీ చేపట్టారు. అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన నేతలు కూడా ఇందులో పాల్గొనడం విశేషంగా చెప్పవచ్చు. వీరందరూ తమ మహారాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో సగం కూడా ఇక్కడ లేవని.. తమను తెలంగాణ రాష్ట్రంలో కలుపాలని నిరసన తెలిపారు. ఇది ప్రస్తుతం శివారు గ్రామాల్లో ఉద్యమంలా సాగుతోంది..
*ఈ ఉద్యమానికి కారణాలివీ..
ఇటీవలే తెలంగాణలోని నిర్మల్ జిల్లా శివారు గ్రామానికి చెందిన అమ్మాయిని మహారాష్ట్రలోని పక్కనే సరిహద్దుల్లో ఉన్న గ్రామానికి చెందిన అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. ఈ సందర్భంగా అమ్మాయి తరుఫు వారికి కళ్యాణ లక్ష్మీ కింద లక్షరూపాయల చెక్కు వచ్చింది. దీన్ని వరుడు వాళ్లకు చూపించగా వారంతా ఆశ్చర్యపోయారు. తమకూ ఇలాంటి పథకం ఉంటే వచ్చేది కదా అని ఊరంతా చర్చించుకున్నారు. ఇక మహారాష్ట్రలోని కొంతమంది రైతులకు నిర్మల్ జిల్లాలో భూములున్నాయి. వారు సాగు చేసుకుంటున్నారు. వారికి గడిచిన రెండు సార్లు రైతుబంధు కింద ఎకరానికి 4వేలు వచ్చాయి. రైతు బీమా అమలు చేశారు. ఇది మహారాష్ట్ర రైతులకు తెలియడంతో వారంతా తమకూ ఈ పథకాలు కావాలంటూ ఆందోళన చేశారు. ఇది సరిహద్దు గ్రామాలకు పాకి 40 గ్రామాల సర్పంచ్ లు, ప్రజలు, అఖిలపక్షం నేతలు ఒక్కటయ్యారు. తమను తెలంగాణలో కలుపాలంటూ ఉద్యమం చేపట్టారు.
*బాజిరెడ్డికి వినతిపత్రం
నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గానికి ఆనుకొని మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న 40 గ్రామాల ప్రజలకు తెలంగాణ వారితో బంధుత్వాలు, సత్సంబంధాలున్నాయి. వీరికి తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఆకర్షించాయి. దీంతో ఈ 40 గ్రామాల సర్పంచ్ లు జేఏసీగా ఏర్పడి తమను తెలంగాణలో కలుపాలని ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే ఎంపీ కవిత, మంత్రి పోచారంకు వినతిపత్రాలు ఇవ్వగా తాజాగా గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి వినతిపత్రం అందించారు. తెలంగాణలోని పథకాలను తమకు అమలు చేయాలని... లేదంటే తెలంగాణలో కలిపేయాలని చేస్తున్న ఈ ఉద్యమం సరిహద్దుల్లో తీవ్ర రూపం దాల్చుతోంది.
*తెలంగాణ ఘనత ఇదీ: కేటీఆర్ ట్వీట్
కాగా మహారాష్ట్ర గ్రామాలు తెలంగాణలో కలుపాలని ఉద్యమించడం తెలంగాణ పాలనకు మచ్చుతునక అని.. కేసీఆర్ పాలన దక్షతకు ఇంతకంటే నిదర్శన లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Full View