జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై నిత్యం విరుచుకుపడే కత్తి మహేశ్ మరోసారి ఫేస్ బుక్ లో సీరియస్ కామెంట్లు చేశారు. హెచ్ ఐవీ వైరస్ కంటే కూడా పవన్ కల్యాణ్ ప్రమాదకరమని ఆయన తన ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేశారు. అంతేకాదు, ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ పై కూడా తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తనను పందితో పోల్చుతూ అసభ్యకర పోస్టులు పెట్టిన అనేక ఫేస్ బుక్ పేజీలు గీతా ఆర్ట్స్ ఆఫీసులోనే క్రియేట్ అయ్యాయని ఆరోపించారు. పవన్ అభిమానులకు తన ఫోన్ నంబర్ షేర్ అయింది అక్కడి నుంచేనని ఆయన తెలిపారు. అల్లు అరవింద్ తో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి విబేధాలు లేవని, దీనిపై ఆయన తక్షణమే స్పందించాలని కోరారు. ఒకవేళ ఈ విషయాలు ఆయనకు ఆల్రెడీ తెలిసుంటే అటువంటి శునకానందానికి దూరంగా ఉండాలని కోరారు.
పవన్ ఒక వైరస్ లా తయారయ్యారని సమాజానన్ని నాశనం చేస్తున్న హెచ్ ఐవీ వైరస్ కంటే ప్రమాదకరంగా మారారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వారికి చట్టపరమైన చర్యల కంటే సామాజిక చికిత్స అవసరమని వ్యాఖ్యానించారు. తన ఫేస్ బుక్ స్నేహితులు ఎంతో మంది పవన్ కల్యాణ్ అభిమానులపై పోలీస్ ఫిర్యాదు చేయవచ్చు కదా అని అడుతున్నారని మహేష్ చెప్పారు. చంపుతామంటూ తనకు వస్తున్న హెచ్చరికలు - అసభ్యరమైన కామెంట్ల నేపథ్యంలో తన స్నేహితులు ఈ సూచన చేస్తున్నారని తెలిపారు. అయితే.. తానెందుకు వారిపై ఫిర్యాదు చేయడం లేదన్న విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తనను విమర్శిస్తున్న పవన్ ఫ్యాన్సులో ఎక్కువ మంది టీనేజర్లేనని... అభిమానమనే పిచ్చితో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని వారిపై ఫిర్యాదు చేస్తే వారి భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు. పవన్ అనే వైరస్ సమాజంలోని ఒక జనరేషన్ లో హేతుబద్ద ఆలోచనను సివిక్ సెన్సును లేకుండా చేసిందని ఆయన అన్నారు. కాగా, తనకొచ్చిన బెదిరింపులకు సంబంధించిన వీడియోలలో కొన్నిటి స్క్రీన్ షాట్స్ ఆయన తన ఫేస్ బుక్ వాల్ లో షేర్ చేశారు. అందులో ఇలా బెదిరింపులకు దిగిన టీనేజర్ల చిత్రాలు - ఫోన్ నంబర్లు కూడా కనిపిస్తున్నాయి.